రూ.9999 ధరకు 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 5G స్మార్ట్‌ఫోన్!
భారత్ మార్కెట్ లో ఒప్పో నుంచి (OPPO India) ఈ సంవత్సరం అనేక మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో ఒప్పో A6 ప్రో, ఒప్పో రెనో 15, ఒప్పో A6 ప్రో 5G, ఒప్పో K14x 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్లు ప్రస్తుతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అయితే గత సంవత్సరం విడుదల అయిన ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం రూ.10 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్ ( OPPO A5x 5G Smartphone ) బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చినా మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్, అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, HD+ డిస్‌ప్లే, IP65 రేటింగ్ తోపాటు 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో రూ.9999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అయితే వివిధ కలర్ వేరియంట్స్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి.

రూ.9999 ప్రారంభ ధరకు :
ఫ్లిప్‌కార్ట్ లో ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9999 గా ఉంది. అదే 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ (లేజర్ వైట్) ధర రూ.13,480 గా ఉంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.15890 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మిడ్‌నైట్ బ్లూ, లేజర్ వైట్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు :
ఈ హ్యాండ్‌సెట్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్, SGS గోల్డ్ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే గ్లౌజ్ టచ్, స్ల్పాష్ టచ్ లను సపోర్టు చేస్తుంది. అంటే తడి చేతులు, గ్లౌజ్ వేసుకొని కూడా ఫోన్ ను ఆపరేట్ చేసుకోవచ్చు.
6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 32MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.
ఒప్పో A5x 5G స్మార్ట్‌ఫోన్ ట్రినిటీ ఇంజిన్ ను కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో AI Eraser 2.0, AI Unblur, AI Clarity Enhancer, AI Smart Image Matting 2.0, Reflection Remover వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఒప్పో ఫోన్ కనెక్టివిటీ పరంగా 5G, 4G, బ్లూటూత్ 5.1, వైఫై 5, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు ఉన్నాయి. IP65 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.


Click it and Unblock the Notifications








