Home
Mobile

బడ్జెట్ ధరలో 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, IP69 రేటింగ్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌!

OPPO A6 5G Smartphone : ఒప్పో A6 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌ లో జనవరి 20 వ తేదీన విడుదల అయింది. బడ్జెట్‌ రేంజ్‌ లో అందుబాటులో అఁదుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. డిజైన్‌ పరంగానూ ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

ఒప్పో A6 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో లాంచ్‌ అయింది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 1125 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 256ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది.

OPPO A6 5G Smartphone

మీడియాటెక్‌ చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. 6GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరీజీతో జతచేసి ఉంటుంది. దీంతోపాటు ARM Mali G57 MC2 GPU కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Color OS 15 పైన పనిచేస్తుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపేచర్‌, ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP కెమెరా, f/2.4 అపేచర్‌ తో 2MP మోనోక్రోమ్‌ లెన్స్‌ ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. 60fps తో 1080p వీడియో రికార్డింగ్‌ ను సపోర్టు చేస్తుంది.

OPPO A6 5G Smartphone

ఈ ఫోన్ 45W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ IP66 + IP68 + IP69 రేటింగ్‌ తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ సాకురా పింక్‌, ఐస్‌ వైట్‌, సఫైర్‌ బ్లూ వంటి మూడు కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై, GPS, QZSS, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, ఇ-కాంపాస్‌, యాక్సెలిరోమీటర్‌ వంటి సెన్సర్‌ లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ లు ఉన్నాయి.

ఒప్పో A6 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో A6 5G స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.19999, 6GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది.

ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1000 క్యాష్‌బ్యాక్‌ ను అందిస్తోంది. దీంతోపాటు మూడు నెలలపాటు నో కాస్ట్ EMI ఆప్షన్‌ ను కూడా అందిస్తోంది. ఒప్పో ఇండియా స్టోర్‌ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO A6 5G Smartphone with 7000mAh battery, IP69 Rating sale is live in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X