7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో OPPO స్మార్ట్‌ఫోన్ విడుదల.. రూ.2000 డిస్కౌంట్‌తో సేల్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో భారత్ మార్కెట్ లో ఒప్పో A6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను (OPPO A6 Pro 5G Smartphone) లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 15 పైన పనిచేస్తోంది. డిజైన్ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ తొలి సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.
ఒప్పో A6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz రీఫ్రెష్ రేట్, 256GB ppi పిక్సల్ డైమెన్సిటీని కలిగి ఉంది. IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.

మీడియాటెక్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ ఒప్పో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ARM Mail MC2 GPU ను కూడా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP కెమెరా, 2MP మోనోక్రోమ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ వెనుక కెమెరాలు 60fps తో 1080p వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి.
ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీ :
ఒప్పో A6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 80W SuperVOOC వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 64 నిమిషాల్లో 0-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని ఒప్పో చెబుతోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేశాక 40 రోజుల స్టాండ్‌బై టైంను అందిస్తుందని చెబుతోంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 5, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్ లైట్ సెన్సర్, ఇ-కంపాస్, యాక్సెలిరోమీటర్ ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఒప్పో A6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ :
ఒప్పో A6 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం ఒప్పో ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌ను తొలి సేల్‌లో భాగంగా యాక్సెస్ బ్యాంకు, HDFC బ్యాంకు క్రెడిట్ కార్డులు సహా AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ కాపచినో బ్రౌన్, అరోరా గోల్డ్ కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








