బడ్జెట్ ధరలో 6500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో OPPO A6s 5G ఫోన్ విడుదల.. ఇవాళ్టి నుంచే సేల్!
భారత్ మార్కెట్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో ఇటీవల అనేక ఫోన్‌లను లాంచ్ చేసింది. గత సంవత్సరం A5 సిరీస్‌ను లాంచ్ చేయగా.. గత డిసెంబర్ నుంచి A6 సిరీస్ ఫోన్లను విడుదల చేస్తోంది. డిసెంబర్ తొలివారంలో ఒప్పో A6x 5G ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అనంతరం జనవరి నెలలో A6 ప్రో 5G, A6 5G మోడల్స్‌ను తీసుకొచ్చింది.
ఇటీవల ఒప్పో K14x, K14 5G ఫోన్‌ను విడుదల చేసిన సంస్థ.. తాజాగా ఒప్పో A6s 5G స్మార్ట్‌ఫోన్‌ను (OPPO A6s 5G Smartphone Launch) లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీ, 50MP కెమెరాలను కలిగి ఉంది. ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. తొలిసేల్‌లో భాగంగా క్యా్ష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.

ఒప్పో A6s 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ ఫోన్ 6.75 అంగుళాల LCD డిస్‌ప్లేతో విడుదల అయింది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మెటాలిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. 8.61mm థిక్‌నెస్‌తో 212 గ్రాముల బరువు ఉంది. IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
ఒప్పో A6s 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్ 6GB ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారిత 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. Trinity ఇంజిన్‌ను కలిగి ఉంది. AI లింక్‌బూస్ట్ 3.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 1 - 41 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుందని ఒప్పో చెబుతోంది. ఫలితంగా రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉంటుందని చెబుతోంది.
కెమెరా విభాగం పరంగా ఒప్పో A6s 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి. ఇందులో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. తక్కువ లైటింగ్‌లోనూ నాణ్యమైన ఫోటోలు క్యాప్చర్ చేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరా ఉంది.

ఒప్పో A6s 5G ధర, సేల్ :
ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.20999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఒప్పో స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
తొలి సేల్‌లో భాగంగా SBI, కోటక్ మహీంద్రా, BOB, YES బ్యాంకు, ఫెడరల్, DBS బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. మూడు నెలల వరకు నోకాస్ట్ EMI ఆప్షన్ ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ అరోరో గోల్డ్, ప్లమ్ పర్పుల్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








