Home
Mobile

OPPO నుంచి బడ్జెట్‌ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు లీక్..!

OPPO A6x 5G Smartphone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి భారత్‌ మార్కెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఒప్పో A6x 5G పేరుతో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. బడ్జెట్‌ ధరలో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ ఫోన్ ధర వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ ఒప్పో ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల అంచనా వివరాలు.

బడ్జెట్ ధరలో :
టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ ఒప్పో A6x 5G స్మార్ట్‌ఫోన్ వివరాలను లీక్‌ చేశారు. ఈ వివరాల ఆధారంగా ఈ ఒప్పో ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12499 గా ఉంటుందని అంచనా వేశారు. 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంటుందని అంచనా వేశారు.

Oppo A6x 5G smartphone

ఒప్పో A6x 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను కూడా టిప్‌స్టర్‌ వెల్లడించారు. ఈ హ్యాండ్‌సెట్‌ 45W వైర్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మీడియాటెక్‌ చిప్‌సెట్, ఆండ్రాయిడ్‌ 15 OS :
ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ తో పనిచేస్తుందని తెలిపారు. ఈ చిప్‌ 8GB ర్యామ్, 128GB స్టోరేజీ తో జతచేసి ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOs పైన పనిచేస్తుందని తెలిపారు.

డ్యూయల్‌ కెమెరాలు :
ఈ హ్యాండ్‌సెట్‌ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. 13MP ప్రైమరీ కెమెరా, VGA కెమెరాతో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. సెల్ఫీ, వీడియో కాల్‌ కోసం 5MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

IP64 రేటింగ్‌ :
ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుందని టిప్‌స్టర్‌ తెలిపారు. ఈ హ్యాండ్‌సెట్‌ 8.58mm థిక్‌నెస్‌, 212 గ్రాముల బరువును కలిగి ఉంటుందని తెలిపారు. అయితే A6x 5G స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడు లాంచ్‌ కానుందనే వివరాలను ఒప్పో వెల్లడించలేదు. ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలపైనా ఎటువంటి స్పందన తెలియజేయలేదు.

ఇటీవలే ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌ :
భారత్‌ మార్కెట్‌లో ఇటీవలే ఒప్పో ఫైండ్ X9 సిరీస్ విడుదల అయింది. ఇందులో భాగంగా ఫైండ్‌ X9, ఫైండ్‌ X9 ప్రో మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్రో మోడల్‌ ఫోన్‌ 200MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది.

ఒప్పో ఫైండ్‌ X9 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W AirVOOC వైర్‌లైస్‌, 10W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7025mAh సిలికాన్ కార్బన్‌ బ్యాటరీని కలిగి ఉంది. అదే ప్రో మోడల్‌ 7500mAh బ్యాటరీని కలిగి ఉంది. బేస్‌ వేరియంట్ ప్రారంభ ధర రూ.74999 గా ఉంది. ప్రో మోడల్‌ ధర రూ.1,09,999 గా ఉంది.

Best Mobiles in India

English summary
Oppo A6x 5G smartphone price leaked in india here are the expected specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X