Home
Mobile

బడ్జెట్ ధరలో 6500mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే, AI ఫీచర్ల OPPO 5G స్మార్ట్‌ఫోన్!

ఒప్పో సంస్థ (OPPO India) బడ్జెట్ ధర సెగ్మెంట్‌ లో ఇటీవల ఒప్పో K14x 5G స్మార్ట్‌ ఫోన్‌ ను లాంచ్‌ చేసింది. 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఒప్పో ఆన్‌లైన్‌ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. మరో ఫోన్ కూడా అదే బ్యాటరీ సామర్థ్యంతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది.

గత సంవత్సరం ఒప్పో సంస్థ A సిరీస్‌ నుంచి బడ్జెట్‌ రేంజ్‌ లో A6x 5G ఫోన్‌ ను (Oppo A6x 5G Smartphone) తీసుకొచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ కూడా HD+ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం రూ.13 వేల ధర రేంజ్‌ లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు.

OPPO A6x 5G smartphone with 6500mAh battery  AI features gets best deal on amazon  Flipkart

ఒప్పో ధర, సేల్‌ వివరాలు :
ఒప్పో A6x 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ధర రూ.13499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉంది.

IP64 రేటింగ్ :
అయితే ఈ రెండు ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను అందిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఓలివ్‌ గ్రీన్‌, ఐస్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ అందుబాటులో ఉంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

HD+ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ :
ఒప్పో a6x 5G స్మార్ట్‌ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1125 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్ రేట్‌ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్ రివర్స్‌ ఛార్జింగ్‌ ను కూడా సపోర్టు చేస్తుంది.

మీడియాటెక్‌ చిప్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ AI LinkBoost 3.0, AI GameBoost 2.0, RAM Expansion వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP ప్రైమరీ కెమెరా, ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, Wi-Fi 5, బ్లూటూత్‌ 5.4, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ప్రాక్సిమిటీ సెన్సర్, యాంబియంట్ లైట్‌, ఇ-కంపాస్‌ వంటి సెన్సర్‌ లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఉంది.

Best Mobiles in India

English summary
OPPO A6x 5G smartphone with 6500mAh battery, AI features gets best deal on amazon, Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X