Home
Mobile

రూ.12499 ధరకు 6500mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లే, IP64 రేటింగ్‌తో 5G స్మార్ట్‌ఫోన్‌!

OPPO A6x 5G Smartphone : ఒప్పో A6x 5G స్మార్ట్‌ఫోన్ భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. 6500mAh భారీ బ్యాటరీ, మీడియాటెక్‌ చిప్‌సెట్, ఫాస్ట్‌ ఛార్జింగ్‌, రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ సేల్‌ ప్రారంభం అయింది. ఈ ఒప్పో ఫోన్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల వివరాలు.

ఒప్పో A6x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఒప్పో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1125 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

OPPO A6x 5G Smartphone

ఆండ్రాయిడ్ 15 స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. ఈ చిప్‌ 6GB ర్యామ్‌, 128GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ మూడు స్టోరేజీ వేరియంట్స్‌ లో అందుబాటులో ఉంది.

కెమెరాలు, ఏఐ ఫీచర్లు :
దీంతోపాటు ఈ ఫోన్‌ AI GameBoost 2.0, AI LinkBoost 3.0, RAM Expansion వంటి ఫీచర్‌ లు ఉన్నాయి. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5MP కెమెరాను అమర్చి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు, రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 48 నెలలపాటు బ్యాటరీ మెరుగైన పనితీరును కనబరుస్తుందని ఒప్పో చెబుతోంది. ఈ ఫోన్ బరువు 212 గ్రాములుగా ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 5, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు ఉన్నాయి. ఇ-కంపాస్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌ ఉన్నాయి.

ఒప్పో A6x 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12499, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.13499, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14999 ను కలిగి ఉంది.

ప్రస్తుతం ఈ ఫోన్‌ ఒప్పో ఇ-స్టోర్‌, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ లో అందుబాటులో ఉంది. తొలి సేల్‌లో భాగంగా 3 నెలల వరకు నోకాస్ట్‌ EMI ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్‌ ఓలివ్‌ గ్రీన్‌, ఐస్‌ బ్లూ కలర్‌ వేరియంట్స్‌ లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO A6x 5G Smartphone with 6500mAh battery, mediatek dimensity 6300 chip launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X