Home
Mobile

బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీతో Oppo A71, ధర చాలా తక్కువ !

చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ71 (2018)ను తైవాన్ మార్కెట్లో విడుదల చేసింది.

By Hazarath

చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ71 (2018)ను తైవాన్ మార్కెట్లో విడుదల చేసింది. కాగా ఈ ఫోన్ భారత్ కి ఎప్పుడు వస్తుందనేది కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ అతి త్వరలోనే ఈ ఫోన్ ఇండియాలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఇండియాలో దీని ధర రూ. 11,465గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ సరికొత్త టెక్నాలజీతో ముందుకు దూసుకువచ్చింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీ ఈ స్మార్ట్ ఫోన్ కి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ రకమైన టెక్నాలజీ ద్వారా కెమెరాతో తీసే ఫోటోలు మంచి క్వాలిటీతో వస్తాయి. అలాగే ఈ ఫోన్‌ను యూనిబాడీ మెటల్‌తో రూపొందించారు. ఇందులో మెమొరీ కార్డు కోసం ప్రత్యేకంగా స్లాట్ ఇచ్చారు. అయితే నిరాశకరమైన అంశం ఏంటంటే ఈ ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయలేదు.

ఒప్పో ఎ71 (2018) ఫీచర్లు

ఒప్పో ఎ71 (2018) ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఒప్పో ఎ71 ( 2017)

ఒప్పో ఎ71 ( 2017)

కాగా ఒప్పో తన ఎ71 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఫోన్ ధర రూ.12,990గా ఉంది. అయితే దీన్ని ప్రస్తుతం రూ.3వేలు తగ్గించారు. దీంతో ఇప్పుడు ఈ ఫోన్‌ను వినియోగదారులు రూ.9,990 ధరకే కొనుగోలు చేయవచ్చు.

 ఒప్పో ఎ71 2017 ఫీచర్లు

ఒప్పో ఎ71 2017 ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఒప్పో ఏ 83

ఒప్పో ఏ 83

గత వారం ఒప్పో తన కొత్త పాపులర్‌ ఫోన్ ఒప్పో ఏ 83 ను 'ఫేస్ అన్లాక్' ఫీచర్‌తో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ. 13,990. ‘ఎ1 బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీ' ఇందులో జోడించినట్టు కంపెనీ చెప్పింది. దీంతో తమ తాజా స్మార్ట్‌ఫోన్‌యంగ్‌ కస్టమర్లకు నేచురల్‌ సెల్ఫీ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుందని పేర్కొంది.

ఒప్పో ఏ 83 ఫీచర్లు

ఒప్పో ఏ 83 ఫీచర్లు

5.7అంగుళాల డిస్‌ప్లే విత్‌ 18.9 రేషియో
1440 X 720 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.1
4జీబీ ర్యామ్‌
32 జీబీ స్టోరేజ్‌
8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
13మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
3,180ఎంఏహెచ్‌ బ్యాటరీ

Best Mobiles in India

English summary
Oppo A71 (2018) With AI-Based Beautification Tech Launched: Specifications, Features more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X