Oppo A77 4G స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్లు చూడండి!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల తయారీ సంస్థ Oppo, భారత మార్కెట్‌కు సరికొత్త మోడల్ మొబైల్‌ను పరిచయం చేసింది. Oppo A77 4G పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ బుధవారం భారత మార్కెట్లో విడుదలైంది. ఈ మొబైల్ MediaTek Helio G35 SoC ప్రాసెసర్‌తో మరియు 4GB RAM తో తయారైంది. అంతేకాకుండా, 50 మెగాపిక్సెల్ క్వాలిటీతో ప్రైమరీ కెమెరా అందిస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా పలు అద్భుతమైన ఫీచర్లను ఈ ఫోన్‌కు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై మనం కూడా ఓ లుక్కేద్దాం. అలాగే భారత మార్కెట్లో వీటి ధరలను కూడా తెలుసుకుందాం.

భారత మార్కెట్లో Oppo A77 4G ధరలు:
భారత మార్కెట్లో ఈ Oppo A77 4G ధరను రూ.15,499 గా నిర్ణయించారు. కంపెనీకి చెందిన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ మొబైల్స్ కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. స్కై బ్లూ, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ వేరియంట్లలో ఇవి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి.
Oppo A77 4G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:
Oppo A77 4G స్పెసిఫిషన్లను చూస్తే.. ఈ మొబైల్ కు 6.56 అంగుళాల HD + LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. డిస్‌ప్లే పై వాటర్ డ్రాప్ నాచ్ కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ColorOS 12.1 ఓఎస్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ MediaTek Helio G35 SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది.

ఈ మొబైల్ 4GB RAM| 64GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మొబైల్ డ్యుయల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరొకటి 2 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ షూటర్ లెన్స్ ఇస్తున్నారు.
ఇక ఛార్జ్ విషయానికొస్తే 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. అంతేకాకుండా ఇది 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, Wi-Fi, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్ సహా పలు ఫీచర్లను అందిస్తున్నారు .
భారత్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Oppo K10 4G మోడల్ స్పెసిఫికేషన్లను కూడా ఓ లుక్కేద్దాం:
ఈ మొబైల్ కు 6.59 అంగుళాల full-HD + (1080 x 2412 pixels) HD+ IPS LCD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్యధికంగా 90Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ColorOS 11.1 ఓఎస్‌పై పని చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm SM6225 Snapdragon 680 4G (6 nm) ప్రాసెసర్ ను కలిగి ఉంది.

ఈ మొబైల్ 6GB, 8GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్రధాన కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరో రెండింటిలో 2 మెగాపిక్సెల్‌తో మాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ క్వాలిటీలో డెప్త్ లెన్స్ ఇస్తున్నారు. సెల్ఫీ మరియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.
ఇక ఛార్జ్ విషయానికొస్తే 5000mAh సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, Oppo K10 వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 4జీ సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.0, A-GPS,USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ సాకెట్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.15,820 కి కొనుగోలుదారులుకు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








