Oppo F17 Pro పై ధర తగ్గింది. అన్ని స్టోర్లలో కూడా...! కొత్త ధర ఇదే !
Oppo F17 తో పాటు సెప్టెంబరులో అధికారికంగా వచ్చిన, F17 ప్రో ధరను ఒప్పో తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్ పై భారతదేశంలో 1,500 రూపాయల ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ధరతగ్గింపు తరవాత ఈ ఒప్పో ఫోన్ ధర రూ.21,490. వద్ద అమ్ముడవుతున్నది. ఈ వివరాలను ముంబైకి చెందిన రిటైలర్ మహేష్ టెలికాం ద్వారా మొదట నివేదించారు. అంతే కాక ఈ కొత్త ధర అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లకు కూడా వర్తిస్తుంది.

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌తో సహా
ఇంకా ఈ కొత్త ధర అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌తో సహా ఇ-కామర్స్ సైట్‌లలో కూడా ఉంచబడుతుంది. మీరు ఒకసారి గుర్తుచేసుకుంటే, ఈ Oppo F17 pro ఫోన్ 8GB+128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,990 వద్ద లాంచ్ చేయబడింది.

Oppo F17 Pro ఫీచర్లు
Oppo F17 Pro మెటల్ ఫినిష్ డిజైన్‌తో ఫ్యూజ్ చేసిన సొగసైన డిజైన్‌తో వస్తుంది. స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.00-అంగుళాల పూర్తి HD + AMOLED డిస్ప్లేని 2400 x 1080 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు మీడియాటెక్ హెలియో P95 చిప్‌సెట్‌తో పాటు 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ లభిస్తుంది. స్టోరేజీ ని మైక్రో SD కార్డ్ ఉపయోగించి మరింత పెంచుకోవచ్చు.

ప్రతి సెల్ఫీ ప్రేమికుడి కోసం
సాఫ్ట్‌వేర్ పరంగా ఈ పరికరం ఆండ్రాయిడ్ 10 పైన కలర్‌ఓఎస్ 7.2 పై నడుస్తుంది. మరియు ఇది 30W VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 4,015 mAh బ్యాటరీ తో విడుదలైంది. ప్రతి సెల్ఫీ ప్రేమికుడి కోసం ఈ ఫోన్లో, 16MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ కలయికతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నందున ఈ ఫోన్ ద్వారా మీరు అద్భుతమైన సెల్ఫీ లు తీసుకోవచ్చు. అంతేకాకుండా, వెనుక కెమెరా మాడ్యూల్‌లో 48MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP సెన్సార్లు ఉన్నాయి.

కొత్త ధర వద్ద ఈ ఫోన్ ను కొనవచ్చా ?
Oppo F17 Pro యొక్క ఇతర లక్షణాలలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. చివరగా మరిన్ని ఫీచర్లు చూస్తే, ఈ ఫోన్ 160.1 x 73.8 x 7.48mm కొలతలు మరియు 164 గ్రాముల బరువును కొలుస్తుంది. ఈ కొత్త ధర వద్ద మీరు ఈ ఫోన్ల ను కొనవచ్చా అని పరిశీలిస్తే, స్పెసిఫికేషన్ ల పరంగా ఈ ధర వద్ద ఒప్పో ఎఫ్ 17 ప్రో ఖచ్చితంగా మంచి ఫోన్. కానీ, ప్రస్తుతం ఇదే ధర వద్ద మీరు అదే స్పెసిఫికేషన్ ల తో 5G ఫోన్ ను కొనవచ్చు.మీరే ఎంపిక చేసుకోండి.


Click it and Unblock the Notifications