Oppo F17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలోనే రానున్నాయి!!! ఫీచర్స్ ఇవే...
ఒప్పో F17 మరియు ఒప్పో F17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల ఇండియా లాంచ్ గురించి రోజు రోజుకి కొన్ని పుకారులు ఎక్కువ అవుతున్నాయి. అలాగే వీటి యొక్క స్పెసిఫికేషన్ల వివరాలు కూడా ట్విట్టర్ ద్వారా లీక్ అయ్యాయి. ఒప్పో F17 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 662 SoC తో మరియు ఒప్పో F17 ప్రో మీడియాటెక్ హెలియో P95 SOC రానున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్లు త్వరలోనే ఇండియాలో ఖచ్చితంగా లాంచ్ అవుతాయని ఒప్పో సంస్థ ధృవీకరించింది. అంతే కాకుండా దీని గురించి కొన్ని టీజర్లను కూడా విడుదల చేయనున్నది. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒప్పో F17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరల వివరాలు
ట్విట్టర్ ద్వారా లీకైన సమాచారం ప్రకారం ఒప్పో యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రూ.25,000 లోపు ధర విభాగంలో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ల గురించి సోషల్ వీడియోలో ఏదైనా సంచారాన్ని షేర్ చేస్తున్నప్పుడు సంస్థ ఒప్పో F17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ‘2020 సొగసైన ఫోన్‌గా' వర్ణిస్తూ విడుదల చేస్తున్నది.

ఒప్పో F17 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
ఒప్పో F17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి లీకైన సమాచారం ప్రకారం ఒప్పో F17 డైనమిక్ ఆరెంజ్, నేవీ బ్లూ మరియు క్లాసిక్ సిల్వర్ వంటి మూడు కలర్ ఎంపికలలో విడుదల కానున్నాయి. ఇవి 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్‌తో వస్తున్నట్లు సమాచారం. ఒప్పో సంస్థ తన గత ఫోన్లకు బిన్నంగా కొత్త ఫోన్లను స్నాప్‌డ్రాగన్ 662 SoC తో తీసుకువస్తున్నట్లు సమాచారం.

ఒప్పో F17 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
ఒప్పో F17 స్మార్ట్‌ఫోన్ 6.44-అంగుళాల S-AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లేను వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 16 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ కెమెరాలు వరుసగా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. అలాగే ఇది 30W ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది163 గ్రాముల బరువుతో 159.8x72.8x7.45mm కొలతల పరిమాణంలో వస్తుంది.

ఒప్పో F17 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
ట్విట్టర్ లో లీకైన సమాచారం ప్రకారం ఒప్పో F17 ప్రో స్మార్ట్‌ఫోన్ మాట్టే బ్లాక్, మ్యాజిక్ బ్లూ మరియు మెటాలిక్ వైట్ అనే మూడు కలర్ ఎంపికలలో విడుదల కానున్నది. ఇది 8GB ర్యామ్, 12GB స్టోరేజ్ ఎంపికలలో రానున్నది. ఒప్పో ఎఫ్ 17 ప్రో ఫోన్ 48 మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ వంటి క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఒప్పో F17 ప్రో స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
ఒప్పో ఎఫ్ 17 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియా టేక్ హెలియో P95 SOC చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇది 6.43-అంగుళాల S-AMOLED డిస్‌ప్లేను ఫుల్ హెచ్‌డి + రిజల్యూషన్ మద్దతుతో వస్తుంది. ఇది పిల్-ఆకారపు హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 164 గ్రాముల బరువుతో 160.14x 73.7x7.48mm కొలతల పరిమాణంలో వస్తుంది. ఈ ఫోన్ 30W VOOC ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ మద్దతుతో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








