Home
Mobile

64MP కెమెరా, 128GB స్టోరేజీ. 6.7 FHD+ డిస్‌ప్లే OPPO 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ.4000 డిస్కౌంట్‌..!!

ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌ ఫెస్టివ్‌ డేస్‌ సేల్‌ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్‌ ధరకు అందిస్తోంది. ఈ ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను (Oppo F25 Pro 5G Smartphone) డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ రెండు స్టోరేజీ వేరియంట్‌లో విడుదల అయింది. 64MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 128GB స్టోరేజీ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ 128GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.23999 గా ఉంది.

Oppo F25 Pro 5G Smartphone

ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్‌ ఫెస్టివ్‌ డేస్‌ సేల్‌ 2024 లో (Flipkart Festive Days Sale 2024) భాగంగా 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే విడుదల ధరతో పోలిస్తే రూ.4000 డిస్కౌంట్‌ను కలిగి ఉంది దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. కోరల్‌ పర్పుల్‌, లావా రెడ్‌, ఒసియన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2412*1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 1100 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే పాండా గ్లాస్‌ రక్షణను పొందుతుంది.

Oppo F25 Pro 5G Smartphone

ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ గ్రాఫిక్స్‌ టాస్క్‌ల కోసం Mail G68 MC4 GPU, 8GB LPDDR4X ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ColorOS 14.0 తో పనిచేస్తోంది.

కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2MP మ్యాక్రో కెమెరాలను అమర్చి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 32MP సోనీ IMX615 కెమెరాను కలిగి ఉంది. ముందు, వెనుక కెమెరాల ద్వారా 30fps వద్ద 4K నాణ్యతతో వీడియోలను రికార్డు చేయవచ్చు.

దీంతోపాటు ఈ కెమెరాలు అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. నైట్‌ మోడ్‌, Pano, స్లో మోషన్‌, పొర్ట్రెయిట్‌ మోడ్‌, ఎక్స్‌ట్రా HD మోడ్‌, టైమ్‌ ల్యాప్స్‌ సహా అనేక ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు 67W సూపర్‌వూక్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ పరంగా 5G, 4G VoLTE, బ్లూటూత్‌ 5.2, వైఫై 802, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. మరియు IP65 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. జియోమెట్రిక్‌ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, గ్రావిటీ సెన్సార్‌, గైరోస్కోప్‌ సెన్సార్‌, ఇన్ డిస్‌ప్లే ఆప్టికల్‌ సెన్సార్‌లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
flipkart festive days sale 2024 offers massive discount on Oppo F25 Pro 5G Smartphone base variant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X