64MP కెమెరా, 8GB ర్యామ్ ఒప్పో స్మార్ట్‌ఫోన్ సేల్.. ఈ కార్డులపై రూ.2000 తగ్గింపు..!
ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (Oppo F25 Pro 5G Smartphone Sale) భారత్‌లో ఫిబ్రవరి 29న లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. మరియు 64MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.
ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ సేల్, ఆఫర్లు : ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.25,999 గా ఉంది.

ఈ హ్యాండ్ సెట్ సేల్ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఒప్పో స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. HDFC, ICICI, SBI డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు..
ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే పండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

ఒప్పో F25 ప్రో 5G హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్ సంబంధించిన టాస్క్‌ల కోసంMail G68 MC4 GPU తో జతచేయబడుతుంది. 8GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజిని కలిగి ఉంది.
64MP ప్రైమరీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా : ఈ ఒప్పో కొత్త ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉన్నాయి. ఇందులో 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఒప్పో F25 ప్రో 5G హ్యాండ్‌సెట్ 32MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ కెమెరాలు అనేక కెమెరా మోడల్‌ను సపోర్టు చేస్తుంది. పొర్ట్రెయిట్ మోడ్, నైడ్ మోడ్, ఎక్స్‌ట్రా HD మోడ్, Pano, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్‌స డ్యూయల్ వ్యూ వీడియో, టెస్ట్ స్కానర్, గూగుల్ లెన్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ముందు, వెనుక కెమెరాల ద్వారా 30fps 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








