Home
Mobile

64MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్, సేల్‌ వివరాలు..!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ త్వరలో భారత్‌లో లాంచ్‌ కానుంది. ఒప్పో F25 Pro 5G ( Oppo F25 Pro 5G Smartphone ) స్మార్ట్‌ ఫోన్ ఫిబ్రవరి 29న భారత్‌లో లాంచ్‌ కానుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లను ఒప్పో సంస్థ ఇప్పటికే ధ్రువీకరించింది. హ్యాండ్‌సెట్‌ డిజైన్, ఇతర వివరాలు విడుదల అయ్యాయి.

తాజాగా ఈ ఫోన్‌ OS, చిప్‌సెట్‌, బ్యాటరీ వంటి వివరాలను టిప్‌స్టర్‌ అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఒప్పో F25 Pro 5G స్మార్ట్‌ ఫోన్‌ ఒప్పో ఇండియా ల్యాండింగ్‌ పేజీలో గుర్తించారు. తాజాగా టిప్‌స్టర్‌ సుధన్‌సు ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.22,999 మరియు 8GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.24,999 ధర ఉంటుందని అంచనా వేశారు.

Oppo F25 Pro 5G Smartphone

ఈ టిప్‌స్టర్‌ తెలిపిన వివరాలు ఆధారంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత UI మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC ను కలిగి ఉంటుంది. మరియు పుల్‌ HD+ 10 బిట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1100 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 5000mAh బ్యాటరీను కలిగి ఉంటుందని తెలిపారు. మరియు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఇప్పటికే ఒప్పో తన కొత్త ఫోన్‌ ఒప్పో F25 Pro 5G హ్యండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లను ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. పాండా గ్లాస్‌ రక్షణ పొందుతుంది. ఒప్పో ఇండియా ల్యాండింగ్ పేజీ ఆధారంగా లక్కీ డ్రా ద్వారా అర్హత పొందిన వారికి ఒప్పో Enco Buds 2 ను ఉచితంగా అందించనున్నారు.

Oppo F25 Pro 5G Smartphone

ఈ ఒప్పో F25 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 64MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుందని ఒప్పో తెలిపింది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 32MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఫిబ్రవరి 29న భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఒప్పో ధ్రువీకరించింది. విడుదల దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే టిప్‌స్టర్‌ వివరాలపై సంస్థ అధికారికంగా స్పందించలేదు. ఫలితంగా ర్యామ్‌, స్టోరేజీ, ధరపై స్పష్టత రావాల్సి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oppo F25 Pro 5G Smartphone specs confirmed ahead of launch on February 29 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X