ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.2000 తగ్గింపు.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ సహా..!
పండుగ సీజన్ సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ (Oppo F27 5G Smartphone Pricedrop) ధరను తగ్గించింది. ఈ హ్యాండ్‌సెట్ భారత్ మార్కెట్‌లో ఆగస్టులో విడుదల అయింది. తక్కువ రోజుల్లోనే ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు 50MP ప్రధాన కెమెరా సహా 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. ఒప్పో తాజాగా ఈ రెండు వేరియంట్‌లలో రూ.2000 చొప్పున ధర తగ్గించింది. ఎమరార్డ్ గోల్డ్, Amber ఆరెంజ్ రంగుల్లో ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ధర తగ్గింపు అనంతరం ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999, అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. ఒప్పో వెబ్‌సైట్ సహా ఇతర ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2400*1080 పిక్సల్స్ రిజల్యూషన్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 394 PPI, 2100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది.

ఈ ఒప్పో హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీంతోపాటు Mali G57 MP2 GPU తో జతచేసి ఉంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 2TB వరకు స్టోరేజీ వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ 45W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కెమెరా విభాగం ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP కెమెరాను కూడా కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత colorOS 14.0 ను కలిగి ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా ఒప్పో F27 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్, 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, Wi-Fi 5, USB 2.0- C, GPS, Glonass, Beidou, QZSS ఫీచర్‌లను కలిగి ఉంది. SGS మరియు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఆర్మర్ బాడీని కలిగి ఉంటుంది. IP64 రేటింగ్‌తో కూడిన డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








