Home
Mobile

ఒప్పో నుంచి భారత్‌లోకి కొత్త ఫోన్‌ విడుదల తేదీ ఖరారు.. 3D కర్వడ్‌ డిస్‌ప్లే సహా ఆకట్టుకొనే ఫీచర్‌లు..!!

ఒప్పో నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి ఒప్పో F27 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ (Oppo F27 pro+ 5G Smartphone Launch) విడుదల కానుంది. తాజాగా సంస్థ ఫోన్‌ లాంచ్‌ తేదీ సహా స్పెసిఫికేషన్‌ల వివరాలను వెల్లడించింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్‌ జూన్‌ 13న భారత్‌లో విడుదల కానుంది. గతంలో వచ్చిన కొన్ని లీక్‌ల ఆధారంగా ఈ ఒప్పో F27 ప్రో+ స్మార్ట్‌ఫోన్.. చైనాలో ఏప్రిల్‌ నెలలో విడుదల అయిన ఒప్పో A3 ప్రో హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

డిజైన్ పరంగా ఒప్పో F27+ 5G స్మార్ట్‌ఫోన్‌ సిల్వర్‌ రింగ్‌ తరహా బోర్డర్‌తో వృత్తాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానల్‌ వేగాన్ లెదర్‌తో రానుంది. మరియు మధ్యలో పాలీ కార్బోనేట్‌ స్ట్రిప్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 3D కర్వడ్‌ డిస్‌ప్లే సహా సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంది. మరియు ముందువైపు పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేతో రానుంది.

Oppo F27 pro Plus 5G Smartphone

ఒప్పో F27 ప్రో + 5G స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో F27 ప్రో + 5G స్మార్ట్‌ఫోన్‌ 3D కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ రక్షణను పొందుతుంది. మరియు డ్రాప్‌ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ 177 గ్రాముల బరువు, 7.89mm మందం (Thickness) తో లాంచ్ కానుంది.

ఒప్పో F27 ప్రో+ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యా్మ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ మరియు 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటు ఉంటుంది. మరియు డస్క్‌ పింక్‌, మిడ్‌నైట్‌ నేవీ రంగుల్లో లభిస్తాయి. దీంతోపాటు కెమెరా, సహా ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Oppo F27 pro Plus 5G Smartphone

ఒప్పో F27 ప్రో + 5G స్మార్ట్‌ఫోన్‌ IP69, IP68, IP66 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. అయితే మిగిలిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

ఒప్పో A3 Pro స్పెసిఫికేషన్‌లు :
ఒప్పో A3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 SoC చిప్‌సెట్‌పైన పనిచేస్తోంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 64MP ప్రధాన కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo F27 pro Plus 5G Smartphone launch date confirmed in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X