Home
Mobile

64MP కెమెరా,మిలిటరీ గ్రేడ్ గట్టిదనం తో Oppo కొత్త ఫోన్! ధర, సేల్ వివరాలు

OPPO సంస్థ ప్రకటించినట్లుగానే భారతదేశంలో 'F సిరీస్'లో కంపెనీ యొక్క తాజా స్మార్ట్‌ఫోన్ Oppo F27 Pro Plus 5G ని లాంచ్ చేసింది. IP69, IP68 మరియు IP66 రేటింగ్‌లు, MIL-STD-810H రేటింగ్‌లతో మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ మరియు డిస్‌ప్లే కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో భారతదేశంలో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది అని కంపెనీ తెలిపింది.

* IP66: దుమ్ము మరియు సాధారణ నీటి జెట్‌ల నుండి అత్యున్నత స్థాయి రక్షణ.
* IP68: 30 నిమిషాల పాటు 1.5మీ వరకు దుమ్ము మరియు నీటిలో ఇమ్మర్షన్‌కు వ్యతిరేకంగా అత్యధిక స్థాయి రక్షణ.
* IP69: 80°C వరకు ఉష్ణోగ్రతల వద్ద దుమ్ము మరియు అధిక పీడన నీటి జెట్‌ల నుండి అత్యధిక స్థాయి రక్షణను అందిస్తాయి.

OPPO F27 Pro Plus 5G price

ఈ ఫోన్ కాస్మోస్ రింగ్ డిజైన్, 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో లెదర్ బ్యాక్‌తో మిడ్‌నైట్ నేవీ మరియు డస్క్ పింక్ రంగులలో ఫోన్ వస్తుంది. స్టెయిన్ రెసిస్టెన్స్‌ని మెరుగుపరచడానికి మరియు కస్టమర్‌లు ఫోన్‌ను కేస్-ఫ్రీగా ఉపయోగించగలరని నిర్ధారించడానికి ఇది లెదర్ బ్యాక్‌కి సిలోక్సేన్‌తో కోటింగ్ చేయబడి ఉంటుంది.

OPPO F27 Pro+ 5G స్పెసిఫికేషన్ల వివరాలు
ఈ ఒప్పో F27 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల (2412×1080 పిక్సెల్‌లు) పూర్తి HD+ అమోలెడ్ కర్వ్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2160Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, గరిష్టంగా 950 nits వరకు బ్రైట్‌నెస్ ఉంటుంది. ఆక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 7050 6nm ప్రాసెసర్‌తో Mali-G68 MC4 GPU కలిగి ఉంది. ఇది 8GB LPDDR4x RAM మరియు 128GB / 256GB UFS 3.1 స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది.

కెమెరా వివరాలు గమనిస్తే, ƒ/1.7 ఎపర్చరుతో 64MP వెనుక కెమెరా, LED ఫ్లాష్, f/2.2 ఎపర్చరుతో 2MP డెప్త్ సెన్సార్, f/2.2 ఎపర్చరుతో 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ (నానో + నానో) ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ColorOS 14 తో ఆండ్రాయిడ్ 14 తో వస్తుంది.

దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP69, IP68 మరియు IP66 రేటింగ్ లు కలిగి ఉన్నాయి.
కనెక్టివిటీ వివరాలు గమనిస్తే, 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ax (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.3, GPS/ GLONASS/ బైదు, USB టైప్-C ఫీచర్లు కలిగి ఉంది. ఇంకా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. 162.7×74.3×7.89mm కొలతలతో మరియు 7.53mm మందంతో 177 గ్రా (లెదర్) / 182 గ్రా బరువు కలిగి ఉంది.

ధర మరియు లభ్యత వివరాలు
ఒప్పో F27 ప్రో ప్లస్ 5G ధర 8GB + 128GB మోడల్‌కు రూ. 27,999 మరియు 8GB + 256GB మోడల్ ధర రూ. 29,999 గా లాంచ్ అయింది.

ఈ ఫోన్ ఇప్పుడు OPPO ఇండియా ఆన్‌లైన్ స్టోర్, Amazon.in, Flipkart మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈరోజు, జూన్ 13 నుండి ప్రీ-ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంది మరియు జూన్ 20 నుండి సేల్ కు అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO F27 Pro Plus 5G With 64MP Camera, IP69 Rating,Military Grade Durability launched In India. Price,Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X