ఒప్పో నుంచి కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు... భారత్‌లో ఈ తరహా ఫోన్ ఇదే.. పూర్తి వివరాలు..!!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలో భారత్ మార్కెట్‌లోకి ఒప్పో F27 సిరీస్ (Oppo F27 Series) విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో F27, ఒప్పో F27 ప్రో, ఒప్పో F27 ప్రో ప్లస్ మోడళ్లు లాంచ్ కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టిప్ స్టర్ ముకుల్ శర్మ విడుదల చేశారు. అయితే ఒప్పో F27 ప్రో మోడల్... భారత్‌లోనే తొలిసారిగా IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో విడుదల కానుందని తెలుస్తోంది.
టిప్‌స్టర్ ముకుల్ శర్మ X పోస్ట్ ఆధారంగా ఒప్పో F27 ప్రో+ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో జూన్ 13వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది. ఈ టిప్‌స్టర్ పోస్టు ఆధారంగా ఒప్పో F27 సిరీస్‌లో ఒక హ్యాండ్‌సెట్ IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ సిరీస్‌లోని ప్రో మోడళ్లలో ఏదో ఒక మోడల్ ఇటీవల చైనాలో విడుదలైన ఒప్పో A3 ప్రో హ్యాండ్‌సెట్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది. A3 ప్రో మోడల్ తరహాలోనే డిజైన్ సహా కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. టిప్‌స్టర్ షేర్ చేసిన పోస్టర్ ఆధారంగా రెండు రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దీంతోపాటు ఒప్పో F27 ప్రో లేదా ప్రో ప్లస్ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ పైన పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యా్మ్‌తో జతచేయబడి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ కెమెరాలను 64MP ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఒప్పో F27 ప్రో మోడళ్లు 67W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, లాంచ్ వివరాలపై ఒప్పో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే సంస్థ F27 సిరీస్‌కు సంబంధించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఈ ఒప్పో F27 సిరీస్ డిస్‌ప్లే సహా OS సహా ఇతర వివరాలు వెల్లడి కాలేదు. అయితే టిప్ స్టర్ విడుదల చేసిన రిపోర్టు ఆధారంగా ఈ సిరీస్ మెరుగైన స్పెసిఫికేషన్ లను కలిగి ఉంటుందని తెలిసింది. అయితే ఈ హ్యాండ్ సెట్‌ల ధర ఎంత ఉంటుందనే వివరాలు వెల్లడి కాలేదు. విడుదల తేదీ పైన ఒప్పో ఎటువంటి ప్రకటన చేయలేదు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








