Home
Mobile

OPPO F29 5G సిరీస్ విడుదల తేదీ వెల్లడి.. అండర్‌ వాటర్‌ ఫొటోగ్రఫీ సహా మిలిటరీ గ్రేడ్‌ ప్రొటెక్షన్‌..!

ఒప్పో F29 5G సిరీస్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ గురించి అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు లీక్‌ అయ్యాయి. తాజాగా ఈ సిరీస్‌ విడుదల తేదీ సహా ఇతర కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో F29 5G, ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ కానున్నాయి. ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు అండర్‌ వాటర్‌ ఫోటోగ్రఫీని సపోర్టు చేస్తుందని సంస్థ తెలిపింది.

ఒప్పో F29 5G సిరీస్‌ విడుదల తేదీ :
ఒప్పో F29 5G సిరీస్‌ (OPPO F29 5G Series Launch) స్మార్ట్‌ఫోన్‌లు మార్చి 20 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ కొత్త ఫోన్‌లు ఒప్పో ఇండియా ఇ-స్టోర్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటాయి.

OPPO F29 5G Series launch date in india revealed

ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా :
ఒప్పో కొత్త ఫోన్‌లు ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేలా రూపొందించిట్లు సంస్థ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్స్‌ 360 డిగ్రీ ఆర్మర్‌ బాడీ మరియు మిలిటరీ గ్రేడ్‌ MIL STD 810H 2022 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్లు స్పాంజ్‌ బయోనిక్‌ కుషనింగ్‌, లెన్స్‌ ప్రొటెక్షన్‌, ఏరోస్పేస్‌ గ్రేడ్ అల్యూమినియం ఇంటర్నల్‌ ఫ్రేమ్‌, కార్నర్‌ డిజైన్ కవర్‌ను కలిగి ఉంది.

అండర్‌ వాటర్ ఫొటోగ్రఫీ! :
ఒప్పో F29 సిరీస్ హ్యాండ్‌సెట్‌ IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అండర్‌ వాటర్ ఫొటోగ్రఫీ ను సపోర్టు చేస్తుంది. బేస్‌ వేరియంట్‌ సోలిడ్‌ పర్పుల్‌, గ్లేసియర్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. అదే ప్రో మోడల్‌ గ్రానైట్ బ్లాక్‌, మార్బుల్‌ వైట్ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుంది.

అంచనా వివరాలు :
ఇటీవల వచ్చిన వివరాల ఆధారంగా బేస్‌ మోడల్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. 6000mAh బ్యాటరీతో పనిచేస్తుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్‌ 50MP OIS, 2MP కెమెరాలు సహా 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ (@yabhishekhd) వివరాల ఆధారంగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.25000 గా ఉంటుందని తెలిపారు.

ఒప్పో F29 5G ప్రో మోడల్‌ 80W Supervooc ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్‌ అ‌య్యే అవకాశం ఉంది. ప్రారంభ ధర సుమారు రూ.30000 గా ఉండే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO F29 5G Series launch date in india revealed, supports under water photography
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X