నీటిలోపల కూడా ఫోటోలు తీసుకొనే అవకాశం ఉన్న 5G ఫోన్‌లు విడుదల.. ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి కొత్త 5G సిరీస్ (OPPO F29 5G Series Launched) లాంచ్ అయింది. ఇందులో ఒప్పో F29 5G, ఒప్పో F29 5G ప్రో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల అయ్యాయి. ఈ ఫోన్‌లు మిలిటరీ గ్రేడ్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. ఈ సిరీస్ హ్యాండ్‌సెట్‌లు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ను సపోర్టు చేస్తాయని ఒప్పో వెల్లడించింది. మెరుగైన సిగ్నల్ కోసం ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్‌లు 6000mAh, 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉన్నాయి.
* ఒప్పో F29 5G స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 1080*2412 పిక్సల్స్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణను పొందుతుంది. 45W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6500mAh బ్యాటరీని కలిగి ఉంది.

3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్ (OPPO F29 5G Smartphone) స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15.0 ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.
ఒప్పో F29 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. EIS (ఎలక్ట్రానిక్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP శాంసంగ్ JN5 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.
ప్రత్యేక ఫీచర్‌లు :
ప్రైమరీ కెమెరా AI లైవ్‌ఫోటో, AI అన్‌బ్లర్, AI Eraser 2.0 వంటి ఫీచర్‌లు సహా అండర్ వాటర్ ఫోటోగ్రఫీని సపోర్టు చేస్తుంది. 30fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు. ఈ ఫోన్ AI లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్ యాంటెనా ను వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ఫలితంగా మెరుగైన సిగ్నల్ ను పొందవచ్చు.
* ఒప్పో F29 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు :
ప్రో మోడల్ (OPPO F29 Pro 5G Smartphone) 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ (1080*2412 పిక్సల్స్) డిస్‌ప్లేతో విడుదల అయింది. 120Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను కలిగి ఉంది.
ఈ టాప్ ఎండ్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15.0 ను కలిగి ఉంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది.
కెమెరాలు :
ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 30fps వద్ద 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.
ప్రైమరీ కెమెరా AI లైవ్‌ఫోటో, AI అన్‌బ్లర్, AI Eraser 2.0 వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌లతోపాటు అండర్ వాటర్ ఫోటోగ్రఫీని సపోర్టు చేస్తుంది. మరియు AI లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్ యాంటెనా ను వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఒప్పో F29 5G స్మార్ట్‌ఫోన్‌లు IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు మిలిటరీ గ్రేట్ MIL STD 810H 2022 డ్రాప్ రెసిస్టెంట్, 360 డిగ్రీల ఆర్మర్ బాడీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఒప్పో F29 5G సిరీస్ 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై 6, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టు వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
The wait is over! Pre-order the all-new #OPPOF29Series5G – starting at ₹23,999! Featuring the stunning OPPO Glow design and a tough 360° Armor Body, this smartphone is made to shine and endure.#TheDurableChampion
— OPPO India (@OPPOIndia) March 20, 2025
Pre-order now: https://t.co/I4uZbocao7 pic.twitter.com/oVea3r3ocV
* ఒప్పో F29 5G సిరీస్ ధర, సేల్ వివరాలు :
ఒప్పో F29 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.23999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.25999 గా ఉంది. ఈ ఫోన్ గ్లేసియర్ బ్లూ, సోలిడ్ పర్పుల్ రంగుల్లో లభించనున్నాయి. ఇవాళ్టి నుంచి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 27 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.31999 గా ఉంది.
ఈ ప్రో మోడల్ ను ఇవాళ్టి నుంచే ప్రీ బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానుంది. గ్రానైట్ బ్లాక్, మార్బుల్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్‌లను ఒప్పో ఇండియా వెబ్‌సైట్ మరియు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
10 శాతం డిస్కౌంట్ :
SBI, HDFC, IDFC ఫస్ట్ బ్యాంక్, యాక్సెస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను పొందవచ్చని ఒప్పో వెల్లడించింది. దీంతోపాటు 10 శాతం ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా పొందవచ్చు. దీంతోపాటు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని ఒప్పో తెలిపింది.


Click it and Unblock the Notifications








