Home
Mobile

Oppo నుంచి త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. చిప్‌సెట్‌, కెమెరా, డిస్‌ప్లే, ధర వివరాలు లీక్‌..!

ఒప్పో నుంచి భారత్‌ మార్కెట్‌లో ఇటీవల ఒప్పో రెనో13 సిరీస్ విడుదల అయింది. త్వరలో మరో సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఒప్పో F29 ప్రో 5G సిరీస్‌ పేరుతో (Oppo F29 Pro 5G Series) భారత్‌లో లాంచ్‌ కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో F29 ప్రో 5G, ఒప్పో F29 ప్రో ప్లస్‌ 5G ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మిడ్‌ రేంజ్‌ ధరలోనే భారత్‌ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చిప్‌సెట్ వివరాలు :
ఒప్పో F29 ప్రో 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్ల వివరాలను టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ (@yabhishekhd) విడుదల చేశారు. దీని ఆధారంగా ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 SoC చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. మరియు ఈ చిప్‌సెట్ LPDDR4X ర్యామ్ మరియు UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉండే అవకాశం ఉంది.

Oppo F29 Pro 5G Series

బేస్‌ వేరియంట్ ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు 6000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 6.7 అంగుళాల క్వాడ్‌ కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

డ్యూయల్‌ కెమెరాలు :
ఈ ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం.

బ్యాటరీ వివరాలు :
ఒప్పో F29 ప్రో ప్లస్‌ 5G హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు 80W వైర్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6500mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. కర్వడ్‌ డిస్‌ప్లే సహా IP69 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రిసిస్టెంట్‌గా ఉంటుందని సమాచారం.

ధర వివరాలు లీక్‌ :
ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధరను టిప్‌స్టర్‌ అభిషేక్‌ యాదవ్‌ (@yabhishekhd) ప్రకారం హ్యాండ్‌సెట్‌ రెండు వేరియంట్స్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర సుమారుగా రూ.25000 గా ఉంటుందని తెలిపారు. 8GB ర్యామ్ + 256GB వేరియంట్‌లోనూ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.

అదే ప్రో ప్లస్‌ మోడల్‌ ప్రారంభ ధర రూ.30,000 గా ఉంటుందని తెలిపారు. మరియు ఈ ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్స్‌లో లాంచ్‌ కానుందని తెలిపారు.

ఒప్పో F29 ప్రో 5G సిరీస్ స్పెసిఫికేషన్‌, ఫీచర్‌లు లాంచ్ వివరాలపై ఒప్పో ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే డిస్‌ప్లే మరియు ప్రో మోడల్‌ కెమెరాలు సహా ఇతర వివరాలు తెలియాల్సి ఉంటుంది. త్వరలో లాంచ్ తేదీ సహా ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oppo F29 Pro 5G Series Smartphone key specifications and features price leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X