నీటిలోనూ ఫోటోలు తీయగలిగే ఫోన్ సేల్.. 6000mAh బ్యాటరీ సహా ప్రత్యేక ఫీచర్‌లివిగో..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి ఇటీవల ఒప్పో f29 5G సిరీస్ లాంచ్ అయింది. ఇందులో భాగంగా f29 5G, f29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. ఇప్పటికే బేస్ వేరియంట్ సేల్ ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్ ఆధారంగా ప్రో మోడల్ సేల్ రేపు సాయంత్రం గంటలకు ప్రారంభం కానుంది. ఈ మోడల్ అండర్ వాటర్ ప్రోటోగ్రఫీ ఫీచర్‌ను కలిగి ఉంది. 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఒప్పో f29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ (OPPO F29 Pro 5G Sale) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.29,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.31999 గా ఉంది. మార్బుల్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఒప్పో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను SBI కార్డు, యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా రూ.2500 వరకు ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల వరకు నోకాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చు. 6 నెలల వరకు లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను పొందవచ్చు.
ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఒప్పో F29 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 12GB LPDDR4x ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15.0 తో పనిచేస్తోంది.
3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ :
ఒప్పో స్మార్ట్‌ఫోన్ AI లింక్‌బూస్ట్ టెక్నాలజీ, హంటర్ యాంటెనా ను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన సిగ్నల్ అందుతుందని ఒప్పో తెలిపింది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
డిస్‌ప్లే :
ఒప్పో స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను పొందుతుంది. ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL STD 810H 2022 డ్రాప్ రెసిస్టెంట్, 360 డిగ్రీల ఆర్మర్ బాడీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
6000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, వైఫై 6, GPS, OTG, USB-C ఛార్జింగ్ పోర్టు ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








