ఒప్పో F3 దీపావళి స్పెషల్ ఎడిషన్ లాంచ్, ఫీచర్లు ఇవే..
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఒప్పో దీపావళి సందర్బంగా ఎఫ్3 సీరిస్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న ఒప్పో దీపావళి సందర్బంగా ఎఫ్3 సీరిస్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఒప్పో ఎఫ్3 దివాళి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఆవిష్కరించిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.18,990గా నిర్ణయించింది.

సెప్టెంబర్ 29 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత ఎఫ్3 మోడల్ ధరతో పోల్చితే రూ.1000 ఎక్కువ. ఈ ఫోన్‌పై భారత క్రికెట్ టీమ్ సంతకాలు ఉంటాయని ఆ కంపెనీ పేర్కొంది.ఎఫ్3 దివాలీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి భారతీయ క్రికెట్ టీమ్ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను ప్రత్యేకంగా అందించనున్నట్లు తెలిపింది.

ఒప్పో ఎఫ్3 ఫీచర్ల విషయానికొస్తే.. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్.

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications