Oppo F3 లాంచ్ అయ్యింది, ధర రూ.19,999
మొదటి సేల్ మే 13న జరుగుతుంది.
భారీ అంచనాల మధ్య Oppo F3 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ధర రూ.19,990. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఈ ఫోన్‌లు దొరుకుతాయి. మొదటి సేల్ మే 13న జరుగుతుంది. మే 12 వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. డ్యుయల్ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.
Read More : మే 8న నోకియా ఏం చెప్పబోతోంది..?

Oppo F3 ఫోన్ డిస్‌ప్లే
Oppo F3 ఫోన్ 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920×1080 పిక్సల్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ డిస్‌ప్లేకు అదనపు ప్రొటెక్షన్‌ను సమకూరుస్తుంది.

ఆకట్టుకునే విధంగా హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్
Oppo F3 ఫోన్‌లోని హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే.. ఆక్టా కోర్ MediaTek MT6750T చిప్‌సెట్ పై ఫోన్ రన్ అవుతుంది. Mali T86-MP2 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే..
ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి Oppo F3 ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ColorOS 3.0 స్కిన్ పై రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే Oppo F3 ఫోన్ 3,200mAh బ్యాటరీతో వస్తోంది.

డ్యుయల్ లెన్స్ సెల్ఫీ కెమెరా...
Oppo F3 ఫోన్ ముందు భాగంలో డ్యుయల్ లెన్స్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా మాడ్యుల్ లో 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ లెన్స్ మాడ్యుల్స్ ఉంటాయి. వీటిలో ఒకటి స్టాండర్డ్ లెన్స్ కాగా, మరొకటి 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్. ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది. OPPO F3 Plus మోడల్ తరహాలోనే OPPO F3 కూడా తన డ్యుయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయబోతోంది. F3 ఫోన్ లో ఏర్పాటు చేసిన డ్యుయల్ సెల్ఫీ కెమెరా ద్వారా స్టన్నింగ్ క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

Oppo F3 కనెక్టువిటీ ఫీచర్లు...
హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ సపోర్ట్, 4జీ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్ 4.1, ఫింగర్ ప్రింట్ స్కానర్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్ సపోర్ట్.

లండన్‌లో ఐసీసీ ఫైనల్ వీక్షించే అవకాశం.
Oppo F3 ఫోన్ ను ముందస్తుగా బుక్ చేసుకునే వారి కోసం ఒప్పో లక్కీ డ్రాను నిర్వహిస్తోంది. ఈ డ్రాలో గెలుపొందని వారికి లండన్ లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించే అవకాశం లభిస్తుంది.


Click it and Unblock the Notifications








