రూ. 3 వేల తగ్గింపుతో 6జిబి ర్యామ్ ఫోన్, నవంబర్ 16 నుంచి ఎక్స్‌క్లూజివ్ విక్రయాలు

Written By:

చైనా దిగ్గజం ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Oppo F3 Plusని ఇండియా మార్కెటోకి లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యంలో ఈ 6జిబి ర్యామ్ ఫోన్ ని విడుదల చేస్తున్నట్లు ఒప్పో కంపెనీ తెలిపింది. ఈ నెల 16 నుంచి దీని విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఎఫ్3లాగానే వినియోగదారులను అలరిస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

స్టన్నింగ్ ఫీచర్లతో మోటో ఎక్స్ 4 వచ్చేసింది, ధర రూ. 20,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.1, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

6జీబీ ర్యామ్‌ వేరియంట్‌..

6జీబీ ర్యామ్‌ వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర 22,990 రూపాయలు. నవంబర్‌ 16 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకానికి రానుంది. కాగా 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ను మార్చిలో రూ.30,990కు కంపెనీ లాంచ్ చేసిన సంగతి విదితమే..

రూ.3000 అదనపు డిస్కౌంట్‌

కాగా కంపెనీతో ఎక్స్‌క్లూజివ్‌ భాగస్వామ్యం నేపథ్యంలో ఈ ఫోన్ మీద ఫ్లిప్‌కార్ట్‌ రూ.3000 అదనపు డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తుంది.

నో-కాస్ట్‌ ఈఎంఐ

అలాగే నో-కాస్ట్‌ ఈఎంఐలు రూ.1,916 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ విలువపై 50 శాతం బైబ్యాక్‌ గ్యారెంటీని అందిస్తుంది.

డెబిట్‌ కార్డులపై కొనుగోలు చేసే కస్టమర్లకు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉచితంగా మూడు నెలల హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oppo F3 Plus 6GB RAM variant to launch in India on November 16 via Flipkart Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot