మార్కెట్‌ను శాసిస్తోన్న ఫోన్ ఇదే, 30 నిమిషాల్లో ఫుల్ చార్జ్, రోజంతా బ్యాకప్

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన స్మార్ట్‌ఫోన్‌ రోజురోజుకు తన శక్తిని పెంచుకుంటోంది. అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక టెక్నాలజీ స్మార్ట్‌ఫోన్‌లను పవర్ ప్యాకుడ్ పెర్ఫామర్స్‌గా మార్చేస్తోంది. ముఖ్యంగా రోజువారీ అవసరాలను తీర్చటంలో కీలక పాత్ర పోషిస్తన్న మొబైల్ డివైస్‌లకు బ్యాటరీ బ్యాకప్ అనేది ప్రధాన ఆయువుపట్టు. బ్యాటరీ బ్యాకప్ ఎంత ఎక్కువ సేపు వస్తే అంత ఎక్కువ సేపు ఫోన్‌ను ఉపయోగించుకునే వీలుంటుంది.

Read More : జియో ధన్ దనా ధన్.. కొత్త ఆఫర్లు కేక?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాటరీ బ్యాకప్ ప్రధాన సమస్య..

ప్రస్తుత పరిస్థితులను మనం చూస్తున్నట్లయితే.. దాదాపు చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లకు బ్యాటరీ బ్యాకప్ సమస్య ప్రధాన అవరోధంగా నిలిచింది. ఫోన్‌లో బ్యాటరీ వీక్‌గా ఉన్నట్లయితే, అది ఎంత గొప్ప ఫోన్ అయినా సరే పనికిరానట్లే.

OPPO F3 Plus

స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ బ్యాకప్ సమస్యలను అధిగమించేందుకు చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో ఒకటైన ఒప్పో (OPPO), ఇన్నోవేటివ్ బ్యాటరీ టెక్నాలజీ మనముందుకు తీసుకువచ్చింది. ఇందుకు, ఈ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన OPPO F3 Plus ప్రత్యక్ష ఉదాహరణ. ఒప్పో తన లెటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన బ్యాటరీకి తోడు ప్రత్యేకమైన చార్జింగ్ ఫీచర్లను పొందుపరిచింది. ముఖ్యంగా హెవీ యూసేజ్‌కు ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు...

శక్తివంతమైన 4000mAh బ్యాటరీ

OPPO F3 Plus ఫోన్ శక్తివంతమైన 4000mAh బ్యాటరీతో వస్తోంది. సింగిల్ ఛార్జ్ పై ఏకంగా 20 గంటల పాటు ఈ ఫోన్‌ను రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు. 6 అంగుళాల ఫుల్ హెచ్‌డి స్ర్కీన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు బ్యాటరీ సరైన కాంభినేషన్‌గా చెప్పుకోవచ్చు.

ధీటైన జవాబు చెబుతుంది..

వీడియోలను స్ట్రీమ్ చేసుకోవటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం, గేమ్స్ ఆడటం, మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేయటం, ఫోన్ కాల్స్ ఇలా అన్ని పనులకు ఈ బ్యాటరీ ధీటైన జవాబు చెబుతుంది. ఒప్పో ఎఫ్ 3 ప్లస్ స్మార్ట్ ఫోన్ లో నిక్షిప్తం చేసిన కట్టింగ్ ఎడ్జ్ పవర్ సేవింగ్ ఆప్టిమైజేషన్స్ బ్యాటరీ శక్తిని ప్రతి నిమిషం ఆదా చేసే ప్రయత్నం చేస్తాయి.

ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ

OPPO F3 Plus ఫోన్ VOOC ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. ఈ VOOC అడాప్టర్‌తో ఫోన్‌ను చార్జ్ చేయటం ద్వారా కేవలం 30 నిమిషాల్లో 0% నుంచి 100% బ్యాటరీ చార్జ్ పూర్తవుతుంది. 5 లేయర్ ప్రొటెక్షన్ సిస్టంతో వస్తోన్న ఒప్పో VOOC చార్జ్ టెక్నాలజీ మైక్రో ప్రోగ్రాముడ్ క్రంటోల్ యూనిట్ ను ఉపయోగించుకుని తక్కువ సమయంలో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసేస్తుంది. హై కరెంట్ ప్రొటెక్షన్ సామర్థ్యంతో వస్తోన్న ఈ అడాప్టర్, ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో హీటింగ్ ను ఏ మాత్రం దరిచేరనివ్వదు.

వీవో వీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌తో కంపేర్ చేసి చూసినట్లయితే...

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన వీవో వీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌తో ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌ను కంపేర్ చేసి చూసినట్లయితే వివో వీ5 ప్లస్ 3,055mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. సింగిల్ చార్జ్ పై ఈ ఫోన్ 16 గంటల బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ చార్జింగ్ ఇంజిన్ టెక్నాలజీ ద్వారా అరగంటలో 43% బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. ఒప్పో ఎఫ్3 ప్లస్ బ్యాటరీ టెక్నాలజీతో వీవో వీ5 ప్లస్ బ్యాటరీ టెక్నాలజీని కంపేర్ చూసినట్లయితే స్పష్టంగా ఒప్పో ఎఫ్3 ప్లస్‌దే పై చేయిగా కనిపిస్తోంది.

 

ఒప్పో ఎఫ్3 ప్లస్ vs వన్‌ప్లస్ 3టీ

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన OnePlus 3T స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీతో ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌ బ్యాటరీని కంపేర్ చేసి చూసినట్లయితే వన్‌ప్లస్ 3టీ 3400mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. 'Dash' ఛార్జింగ్ టెక్నాలజీని ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఛార్జ్ పై వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్‌ను దాదాపుగా రోజు మొత్తం వాడుకోవచ్చు. వన్‌ప్లస్ 3టీ బ్యాటరీ పనితీరును ఒప్పో ఎఫ్3 ప్లస్ బ్యాటరీతో విశ్లేషించి చూడటం ద్వారా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లలో వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని హైడెఫినిషన్ వీడియోలను ప్లే చేయటం జరిగింది. వీడియోలు ప్లే అవుతోన్న సమయంలో ఈ ఫోన్‌లకు సంబంధించి డిస్‌ప్లే బ్రైట్నెస్ లెవల్ 60%గా ఉంది. వీడియో పూర్తి అయ్యే సమయానికి ఒప్పో ఎఫ్3 ప్లస్ బ్యాటరీ లెవల్ 7% తగ్గగా, వన్‌ప్లస్ 3టీ బ్యాటరీ లెవల్ 10% తగ్గింది.

ఒప్పో ఎఫ్3 ప్లస్ vs సామ్‌సంగ్ సీ9 ప్రో

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Samsung C9 Pro స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీతో ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌ బ్యాటరీని కంపేర్ చేసి చూసినట్లయితే సామ్‌సంగ్ సీ9 ప్రో 4000mAh బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో AMOLED ప్యానల్‌ను సామ్‌సంగ్ ఉపయోగించుకోవటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఈ ఫోన్ ముందంజలో నిలిచింది. మరోవైపు ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌ IPS ప్యానల్‌ను కలిగి ఉండటం ద్వారా డిస్‌ప్లేకు బ్యాటరీ ఎక్కువుగా అవసరమవుతుంది. అయితే డే లైట్ కండీషన్స్‌లో సామ్‌సంగ్ సీ9 ప్రో అమోల్డ్ డిస్‌ప్లేతో పోలిస్తే ఒప్పో ఎఫ్3 ప్లస్ IPS ప్యానల్ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

హైక్వాలిటీ కెమెరా..

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌‌లో బ్యాటరీ బ్యాకప్ అంశాన్ని పక్కన పెడితే కెమెరా క్వాలిటీ కూడా అదరహో అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలు హైక్వాలిటీ సెల్ఫీలను ఉత్పత్తి చేస్తాయి. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరా ద్వారా తక్కువ వెళుతరు కండీషన్స్ లోనూ ప్రోఫెషనల్ క్వాలిటీ ఫోటోలను చిత్రీకరించుకోవచ్చు.

బెస్ట్ క్లాస్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌

ఒక్క డ్యుయల్ సెల్ఫీ కెమెరా మాత్రమే కాదు.. 6 అంగుళాల క్వాలిటీ రిచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 4000 mAh బ్యాటరీ, VOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి శక్తివంతమైన ఫీచర్లు ఎఫ్3 ప్లస్ ఫోన్‌లో ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడిన ఒప్పో ఎఫ్3 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ క్లాస్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌ను చేరువచేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

డిజైనింగ్ విషయానికి వస్తే...

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ 7.53 మిల్లీమీటర్ల మందంతో కూడిన స్లీక్ బాడీని కలిగి ఉంటుంది. ఫోన్ బరువు కేవలం 185 గ్రాములు. మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ నిర్మాణంలో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యుమినియమ్‌ను ఉపయోగించారు. ఫోన్ డిస్ ప్లే పై వేసిన 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ రక్షణ కవచంలా నిలుస్తుంది.

 

మల్టీ టచ్ హై-డెఫినిషన్ డిస్‌ప్లే

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ 6 అంగుళాల మల్టీ టచ్ హై-డెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే బ్రైట్‌నెస్, వ్యూవింగ్ యాంగిల్స్ ఇంకా టచ్ రెస్పాన్సివ్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది. కంప్యూటింగ్ ఇంకా మల్టీటాస్కింగ్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ Qualcomm's Snapdragon 653 SoC పై రన్ అవుతుంది. 4జీ ర్యామ్ అంతరాయంలేని పనితీరును ఆఫర్ చేస్తుంది.

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ..

స్టోరేజ్ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి ఎఫ్3 ప్లస్ ఫోన్ 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 4జీ వోల్ట్ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో కాల్ క్వాలిటీ నాణ్యమైన ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన Color OS V3.0 కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ యూజర్‌కు కొత్త మొబైలింగ్ అనుభూతులను చేరువచేస్తుంది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్

ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌కు అదనపు సెక్యూరిటీగా నిలుస్తుంది. హోమ్ బటన్‌కు అనుసంధానించబడిన ఈ సెన్సార్ ద్వారా ఫోన్‌ను కేవలం 0.2 సెకన్ల వ్యవధిలో అన్‌లాక్ చేయవచ్చు. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కేవలం ఫోన్ అన్‌లాకింగ్‌కు మాత్రమే కాకుండా అనేకమైన పనులకు కస్టమైజ్ చేసుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OPPO F3 Plus battery performance: Dominating the “new smartphone battleground”. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot