బెస్ట్ క్లాస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇది కూడా ఒకటి

ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో పనితీరును మాత్రమే కీలకంగా భావించే వారు. ఇప్పుడు పనితీరుతో పాటు స్టైల్ అనేది కూడా ప్రధాన బెంచ్‌మార్క్‌గా మారిపోయింది.

|

స్మార్ట్‌‌‌ఫోన్‌లు మనందరి జీవితాలను మరింత సుఖమయం చేసేసాయి. నేటి ఆధునిక కమయూనికేషన్ ప్రపంచంలో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు స్మార్ట్‌‌ఫోన్‌లతో ఏదో ఒకపని ముడిపడే ఉంటోంది. కాల్స్, బ్రౌజింగ్, చాటింగ్, గేమింగ్, షాపింగ్ ఇలా అన్ని అవసరాలను స్మార్ట్‌ఫోన్‌లు తీర్చగలుగుతున్నాయి. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో పనితీరును మాత్రమే కీలకంగా భావించే వారు. ఇప్పుడు పనితీరుతో పాటు స్టైల్ అనేది కూడా ప్రధాన బెంచ్‌మార్క్‌గా మారిపోయింది.

Selfie Expert ఫ్యామిలీ నుంచి..

Selfie Expert ఫ్యామిలీ నుంచి..

తాజాగా, చైనా ఫోన్‌ల కంపెనీ ఒప్పో తన Selfie Expert ఫ్యామిలీ నుంచి మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకవచ్చింది. ఒప్పో ఎఫ్3 ప్లస్ పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచపు మొట్టమొదటి డ్యుయల్ సెల్ఫీ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 6 అంగుళాల డిస్‌ప్లేతో అద్బుతంగా క్రాఫ్ట్‌కాబడిన ఈ ఫోన్ ధర రూ.30,990. ప్రీమియమ్ కళానైపుణ్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఈ ఫోన్‌ను అభివర్ణిస్తున్నారు.

మెటల్ ఇంకా డ్యూరబుల్ గ్లాస్ కలయకతో..

మెటల్ ఇంకా డ్యూరబుల్ గ్లాస్ కలయకతో..

మెటల్ యునిబాడీ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌లో కనిపించే ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ డ్యూరబులిటీ పరంగా మంచి మార్కులను కొట్టేసింది. ఈ ఫోన్ రూపకల్పనను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒప్పో, ఫోన్‌కు మరింత స్మూత్ ఫీల్‌ను తీసుకువచ్చేందుకు సాండ్-స్ప్రేయింగ్, త్రీ స్టేజ్ పాలిషింగ్, అనేక రౌండ్ల సీఎన్‌సీ మిల్లింగ్ వంటి కొత్త పద్ధతలను బాడీ నిర్మాణంలో భాగంగా ఉపయోగించింది.

బలమైన మెటల్ ఫ్రేమ్‌,  2.5డి గొరిల్లా గ్లాస్

బలమైన మెటల్ ఫ్రేమ్‌, 2.5డి గొరిల్లా గ్లాస్

ఫోన్ వెనుక భాగంగా బలమైన మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగాన్ని 5 అంగుళాల 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 స్ర్కీన్ కవర్ చేసేస్తుంది. chamfered ఎడ్జెస్, క్రోమ్ లైనింగ్, కెమెరా మాడ్యుల్ ఇంకా ఫోన్ హోమ్ బటన్ వ్యవస్థలు స్మార్ట్‌ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను ఆఫర్ చేస్తాయి.

 

 6 అంగుళాల భారీ డిస్‌ప్లే

6 అంగుళాల భారీ డిస్‌ప్లే

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ 6 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తోంది. ఇంత పెద్ద స్ర్కీన్‌తో వస్తున్నప్పటికి ఫోన్ ఏ మాత్రం బల్కీగా అనిపించదు. ఒప్పో నుంచి ఇప్పటికి విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఎఫ్3 ప్లస్ మోడల్ బెటర్ గ్రిప్‌ను ఆఫర్ చేస్తుంది. ఇదే సమయంలో ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ ‘Six-String' అల్ట్రా ఫైనా యాంటెనా వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ రంగులో కలిసిపోయే ఈ యాంటెనా లైన్స్ ఫోన్ డిజైనింగ్‌ను ఏమాత్రం దెబ్బతీయవు.

వేగంగా స్పందించే ఫింగర్ ప్రింట్ స్కానర్..

వేగంగా స్పందించే ఫింగర్ ప్రింట్ స్కానర్..

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ మరో ప్రధార ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన ఈ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ ద్వారా కేవలం 0.2 సెకన్లలో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.ఫోన్‌కు అదనపు సెక్యూరిటీ లాగా ఉపయోగ పడే ఈ సెన్సార్ ఫోన్ హోమ్ బటన్ భాగంలో ఏర్పాటు చేయబడింది.ఈ సెన్సార్‌ను కావల్సిన విధంగా కస్టమైజ్ చేసుకుని అనేకమైన పనులకు ఉపయోగించుకోవచ్చు.

బెస్ట్ క్లాస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒప్పో ఎఫ్3 ప్లస్‌ ఒకటి..

బెస్ట్ క్లాస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒప్పో ఎఫ్3 ప్లస్‌ ఒకటి..

ఒక్క మాటలో చెప్పాలంటే ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌ను వన్-హ్యాండ్ ఆపరేషన్‌కు అనుగుణంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. ఈ ఫోన్‌కు సంబంధించిన బాడీ టు స్ర్కీన్ రేషియో ఇంకా వెయిట్ సమతూకంతో పర్‌ఫెక్ట్‌గా అనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్లాస్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒప్పో ఎఫ్3 ప్లస్‌ను ఒకటిగా చెప్పుకోవచ్చు.

Best Mobiles in India

English summary
OPPO F3 Plus is the true example of premium craftsmanship. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X