డ్యుయల్ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్3 ప్లస్, ధర రూ.30,990

ఒప్పో ఎట్టకేలకు తన డ్యుయల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో ఎఫ్3 ప్లస్’ (Oppo F3 Plus)ను ఇండియాలో లాంచ్ చేసింది. ధర రూ.30,990. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ Selfie Expert ఫోన్ లభ్యమవుతుంది. ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Read More : ఫోన్ నచ్చకుంటే 90 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సెటప్‌..

ఈ ఫోన్‌కు సంబంధించిన ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ సెటప్‌తో వస్తోంది. 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి. ఫోన్‌కు సంబంధించిన రేర్ కెమెరా 16 మెగా పిక్సల్ సోనీ IMX398 సెన్సార్‌తో పాటు డ్యుయల్ PDAF సపోర్ట్‌తో వస్తుంది.

హైక్వాలిటీ సెల్ఫీ..

ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్‌ కు ఫ్రంట్ డ్యుయల్ లెన్స్ సెటప్ ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఈ మెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు. Palm Shutter, Screen Flash, Selfie Panorama, Beautify 4.0 వంటి ప్రత్యేకమైన కెమెరా ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది.

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే..

డిస్‌ప్లే సైజు విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ కెపాసిటీ 1920 x 1080పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ స్ర్కీన్‌కు రక్షణ కవచంలా నిలుస్తుంది.

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి.. ఒప్పో ఎఫ్3 ప్లస్ ఫోన్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 635 ప్రాసెసర్‌తో ఎక్విప్ కాబడి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌కు సంబంధించిన క్లాక్ వేగం 1.95GHzగా ఉంటుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు.

VOOC క్విక్ ఛార్జింగ్ సపోర్ట్...

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ColorOS 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఒప్పో ఎఫ్3 ప్లస్ రన్ అవుతుంది. 4000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఒప్పో, ఈ ఫోన్‌లో ఏర్పాటు చేసింది. VOOC క్విక్ ఛార్జింగ్ ఫీచర్‌తో వస్తోన్న ఈ బ్యాటరీని నిమిషాల వ్యవధిలో ఛార్జ్ చేయవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్, యూఎస్బీ ఆన్ ద గో వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ లో ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Oppo F3 Plus with dual selfie camera launched in India at Rs. 30,990; Pre-orders are open. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot