OPPO నుంచి మూడు స్మార్ట్‌ఫోన్‌లు.. 7000mAh భారీ బ్యాటరీ, ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ సహా..!
ఒప్పో భారత్ మార్కెట్‌లో తాజాగా ఒప్పో F31 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను (OPPO F31 5G Series) విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో F31, F31 ప్రో, F31 ప్రో ప్లస్ మోడల్స్ లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 7000mAh బ్యాటరీతో పనిచేస్తాయి. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, MIL STD 810H 2022 సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది.
* ఒప్పో F31 5G :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే AGC DT స్టార్ D+ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. 360 డిగ్రీల డ్యామేజీ ప్రూఫ్ ఆర్మర్ బాడీని కలిగి ఉంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. 80W SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. రివర్స్, బైపాస్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా (AF), 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. అండర్ వాటర్ వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్టు చేస్తాయి. వెనుక కెమెరాల ద్వారా 30fps, 60fps తో 1080p వీడియో రికార్డు చేయవచ్చు.

* ఒప్పో F31 ప్రో 5G :
ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ లెన్స్ మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది. 80W SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఏఐ కాల్ అసిస్టెంట్, ఏఐ ఎడిటర్ 2.0, ఏఐ లింక్ బూస్ట్ 3.0, ఏఐ వాయిస్‌స్క్రైబ్ వంటి ఫీచర్లున్నాయి.

* ఒప్పో F31 ప్రో ప్లస్ 5G :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB LPDDR4x ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజీ ని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్ లెన్స్ మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ఏఐ కాల్ అసిస్టెంట్, ఏఐ ఎడిటర్ 2.0, ఏఐ లింక్ బూస్ట్ 3.0, ఏఐ వాయిస్‌స్క్రైబ్ వంటి ఫీచర్లున్నాయి. 80W SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. MIL STD 810H 2022 సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ సిరీస్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఒప్పో F31 5G, F31 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు 4363 mm sq మరియు 4300 mm sq కూలింగ్ ఛాంబర్లను కలిగి ఉంది. అదే ప్రో ప్లస్ 5G మోడల్ 5219 mm sq వేపర్ ఛాంబర్‌ను కలిగి ఉంది.
ఒప్పో F31 5G సిరీస్ ధర, సేల్ వివరాలు :
ఒప్పో F31 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ బ్లూమ్ రెడ్, క్లౌడ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఒప్పో F31 ప్రో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.28999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.30999 గా ఉంది. డిజర్ట్ గోల్డ్, స్పేస్ గ్రే కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఒప్పో F31 ప్రో ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32999 గా ఉంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.34999 గా ఉంది. జెన్‌స్టోన్ బ్లూ, ఫెస్టివల్ పింక్, హిమాలయన్ వైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఒప్పో F31 5G స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 27 నుంచి సేల్ ప్రారంభం కానుంది. అదే ప్రో మోడల్స్ సెప్టెంబర్ 19 నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications