7000mAh బ్యాటరీ, ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో 5G ఫోన్ సేల్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ ఒప్పో ఈ నెల ప్రారంభంలో ఒప్పో F31 సిరీస్ విడుదల చేసింది. ఇందులో భాగంగా F31, F31 ప్రో, F31 ప్రో ప్లస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రో మోడల్స్ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా.. బేస్ వేరియంట్ సేల్ (OPPO F31 5G Smartphone Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది.
ఒప్పో F31 5G స్మార్ట్‌ఫోన్ ను ఒప్పో ఇ-స్టోర్, అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ప్రముఖ రిటైల్ స్టోర్ లలోనూ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 గా ఉంది.

10 శాతం డిస్కౌంట్ :
ఈ ఫోన్‌ను SBI, HDFC, కోటక్ మహీంద్రా కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ను అందిస్తోంది. దీంతోపాటు ఎక్స్ఛేంజీ బోనస్, 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్షన్ ను అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, క్లౌడ్ గ్రీన్, బ్లూమ్ రెడ్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.
ప్రత్యేక ఫీచర్‌లు :
ఒప్పో F31 5G స్మార్ట్‌ఫోన్ ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ను కలిగి ఉంది. MIL STD 810H 2022 సర్టిఫికేషన్ ను కూడా కలిగి ఉంది. IP66, IP68, IP69 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది. ఈ ఫోన్ 4363 mm sq కూలింగ్ ఛాంబర్ ను కలిగి ఉంది.
డ్యామేజీ ప్రూఫ్ ఆర్మర్ బాడీ :
ఒప్పో F31 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. AGC DT స్టార్ D+ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. 360 డిగ్రీల డ్యామేజీ ప్రూఫ్ ఆర్మర్ బాడీతో అందుబాటులోకి వచ్చింది.

3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పైన పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతుందని ఒప్పో తెలిపింది.
7000mAh బ్యాటరీ :
ఈ హ్యాండ్‌సెట్ 80W SuperVOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ రివర్స్, బైపాస్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








