Home
Mobile

OPPO F31 Series 5G పండుగ సీజన్‌ కోసం వచ్చింది : మన్నిక కోసం, రోజువారీ అవసరాల కోసం అందుబాటులోకి వచ్చింది

భారత్‌లో స్మార్ట్‌ఫోన్ కేవలం కమ్యూనికేషన్ పరికరం మాత్రమే కాదు. రోజువారీగా అనేక పనుల కోసం యూజర్లు స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడుతున్నారు. అందువల్ల తీ‌వ్రమైన ఎండలు, ఆకస్మిక వర్షాలు, ప్రయాణాలు, ప్రమాదాలను తట్టుకోవాల్సి ఉంటుంది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకొని OPPO F31 5G సిరీస్‌ను రూపొందించింది.

F సిరీస్‌ వారసత్వం లక్షణాలను దృష్టిలో పెట్టుకొని OPPO F31 Pro+ 5G, OPPO F31 Pro 5G, OPPO F31 5G ఫోన్‌లు స్టైలిష్‌ డిజైన్‌, పనితీరు, థర్మల్‌ మేనేజ్‌మెంట్, ఎక్కువ మన్నిక వచ్చే బ్యాటరీ లను కలిగి ఉంటుంది. రూ.30 వేల ధరలో మీరు మంచి స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్నట్లయితే F31 ప్రో, F31 5G స్మార్ట్‌ఫోన్‌లు మీకు మంచి ఆప్షన్ కానున్నాయి.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

బిల్ట్‌ ఫర్‌ రియల్‌ వరల్డ్‌ డ్యూరబిలిటీ
భారత్‌ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు మన్నిక ప్రధాన అంశంగా ఉంటుంది. కౌంటర్‌పాయింట్‌ పరిశోధన ప్రకారం 79 శాతం యూజర్లు మన్నికను ప్రధాన అంశంగా భావిస్తున్నారు. 86 శాతం OPPO యూజర్లు ఈ బ్రాండ్‌ మన్నికపై సానుకూలంగా స్పందించారు. 67 శాతం యూజర్లు డ్యామేజీ కారణంగా తమ ఫోన్‌లు మరమతు చేయించుకున్నట్లు చెప్పారు. 78 శాతం మంది యూజర్లు నీటికి దగ్గరగా తమ ఫోన్‌లు ఉపయోగించకుండా ఉంటారు. 85 శాతం యూజర్లు తమ ఫోన్‌ను తడి లేదా జిడ్డు చేతులతో వినియోగిస్తున్నట్లు అంగీకరించారు.

OPPO F31 5G సిరీస్‌ ఈ తరహా ఆందోళనలకు ట్రిపుల్ IP సర్టిఫికేషన్లతో (IP66, IP68, IP69) చెక్‌ పెట్టింది. ఈ సిరీస్ ఫోన్‌లు డస్ట్‌, నీరు, అధిక పీడనం కలిగిన జెట్‌ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఈ సిరీస్‌ ఫోన్‌లు టీ, కాఫీ, జ్యూస్, డిటర్జెంట్‌ వాటర్‌, వేడి నీరు వంటి సుమారు 18 రకాల ద్రవాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈక్వలేజేషన్‌ మెంబ్రేన్‌ ద్రవ వేగాన్ని నిరోధించేందుకు అంతర్గతంగా గాలి పీడనాన్ని సమతుల్యం చేస్తుంది. ఫోన్‌ నీట మునిగిన అనంతరం స్పీకర్‌ డ్రైనేజ్‌ సిస్టమ్‌ ఆ నీటిని వేగంగా బయటకు పంపుతుంది.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

ఈ సిరీస్‌ ఫోన్‌లు సున్నితమైన, క్లిష్టమైన విభాగాల చుట్టు మల్టీ లేయర్‌ ఎయిర్‌బ్యాగ్‌ కుషనింగ్‌ తో కూడిన 360 డిగ్రీల ఆర్మర్ బాడీని కలిగి ఉంటుంది. దీంతో ఈ ఫోన్‌లు పొరపాటున కింద పడినా, డ్యామేజీ కాకుండా ఉంటాయి. దీంతోపాటు ఏరోస్పేస్‌ గ్రేడ్ AM04 అల్లాయ్‌ ఫ్రేమ్ మరింత దృఢత్వాన్ని అందిస్తుంది. అదే AGC DT - Star D+ గ్లాస్‌ ఇంపాక్ట్ రెసిస్టెన్స్‌ను మెరురుపరుస్తుంది. ఈ సిరీస్ ఫోన్‌లు MIL STD 810H మిలిటరీ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. ఇందులో అధిక వేడి, అధిక చలి, వైబ్రేషన్‌, డస్ట్, షాక్ నుంచి రక్షణ కల్పిస్తాయి. OPPO ఈ సిరీస్‌కు ఫ్రీజ్‌ టెస్ట్‌ కూడా చేసింది. అంటే ఫోన్‌ ను మంచులో ఉంచి, అనంతరం బయటకు తీసిన తర్వాత కూడా మెరుగైన పనితీరునే కనబరిచింది.

ప్రీమియం లుక్‌తో
ఇతర దృఢమైన అంశాలతోపాటు సన్నని, స్టైలిష్‌ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. OPPO F31 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ జెమ్‌స్టోన్‌ బ్లూ, హిమాలయన్‌ వైట్, ఫెస్టివ్‌ పింక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదే OPPO F31 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ డిజర్ట్ గోల్డ్, ఫెస్టివ్‌ గ్రే కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

OPPO F31 5G స్మార్ట్‌ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లూ, క్లౌడ్‌ గ్రీన్‌, బ్లూమ్‌ రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. 8mm థిక్‌నెస్‌తో 185 గ్రాముల బరువును కలిగి ఉంది. F31 సిరీస్‌ స్టైలిష్‌ డిజైన్‌తోపాటు మన్నిక వచ్చేలా రూపొందించబడింది.

సంవత్సరాలు నిలిచి ఉండేలా
OPPO F31 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ 4nm క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌ పనితీరు, సామర్థ్యాన్ని సమతుల్యం చేస్తుంది. OPPO F31 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ఎనర్జీ చిప్‌సెట్, అదే OPPO F31 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎనర్జీ చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 5G సామర్థ్యం, థర్మల్‌ స్థిరత్వం, రోజువారీ వినియోగం సహా కఠినమైన పరిస్థితుల్లోనూ మెరుగైన పనితీరు కనబరిచేలా ఈ చిప్‌సెట్‌లను ఆప్టిమైజ్‌ చేశారు.

ఈ చిప్‌సెట్‌లకు OPPO డ్యూయల్‌ ఇంజిన్‌ స్మూత్‌నెస్‌ సిస్టమ్‌ సపోర్టు ఇస్తుంది. ఇది ట్రినిటీ ఇంజిన్, లూమినస్‌ రెండరింగ్‌ ఇంజిన్‌లను కలుపుతుంది. యాప్‌ ఇన్‌స్టాలేషన్ సమయాన్ని 26 శాతానికి తగ్గిస్తుంది. స్మూత్‌నెస్‌ను 22 శాతానికి పెంచుతుంది, మ్యాప్‌, చెల్లింపులు, కాలింగ్‌ వంటి యాప్‌ల మధ్య సులభంగా మారవచ్చు.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

72 నెలల ఫ్లూయన్సీ సర్టిఫికేషన్‌ కారణంగా ఈ ఫోన్ 6 సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. వన్‌ క్లిక్‌ రిజువనేషన్ టూల్‌ తక్షణమే సిస్టమ్‌ను రీఫ్రెష్‌ చేస్తుంది. దీంతో 15 శాతం ఫెర్ఫామెన్స్ బూస్ట్, 20 శాతం వేగంగా యాప్‌ లాంచ్‌ అవుతుంది.

ఈ సిరీస్‌లో థర్మల్‌ సిస్టమ్‌ డిజైన్ సమానంగా ఉంటుంది. OPPO F31 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌ 5219 mm Sq సూపర్‌ కూల్‌ VC సిస్టమ్‌, F31 Pro 5G, F31 5G ఫోన్‌లు 4363mm Sq, 4300mm Sq కూలింగ్ ఛాంబర్‌లను కలిగి ఉన్నాయి. అడాప్టివ్‌ థర్మల్‌ స్ట్రాటజీ కారణంగా ప్రాసెస్‌ సులభంగా జరుగుతుంది. 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ సిరీస్‌ SGS S+ హై టెంపరేషర్‌ ఫ్లూయన్సీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. స్థిరమైన ఫ్రేమ్ రేట్‌, టచ్‌ రెస్పాన్స్‌ను అందిస్తుంది.

మెరుగైన బ్యాటరీ పనితీరు
ఈ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. OPPO బయోనిక్‌ రిపేర్‌ ఎలక్ట్రోలైట్ ను ఉపయోగిస్తుంది. అవసరం అయిన సమయాల్లో బ్యాటరీ రక్షణ పొరను మరమతు చేస్తుంది. 1830 ఛార్జింగ్‌ సైకిల్స్‌ వరకు పనిచేస్తుంది. 5 సంవత్సరాల తర్వాత 80 శాతం సామర్థ్యాన్ని అందిస్తుంది.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

అడ్వాన్సడ్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌లు 80W SUPERVOOC ఫ్లాష్‌ ఛార్జ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు బైపాస్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫీచర్ గేమింగ్ వంటి సమయాల్లో నేరుగా ఛార్జింగ్‌ అయ్యేలా చూస్తుంది. రివర్స్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉ‌ష్ణోగ్రత, -20 సెల్సియస్‌ చలి వాతావరణంలోనూ మెరుగైన పనితీరునే అందిస్తుంది.

కనెక్టివిటీ కోసం
పొరపాటున కిందపడినా డ్యామేజీ కాకుండా ఎలాంటి మంచి ఫీచర్‌లు ఉన్నాయో.. అలానే మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. OPPO F31 5G సిరీస్‌ హంటర్‌ యాంటీనా ఆర్కిటెక్చర్‌ ను కలిగి ఉంటుంది. యాంటెన్నా లేఅవుట్‌ ఫ్రేమ్‌లో 91.6 శాతం కవర్‌ చేస్తుంది. అయితే సిగ్నల్‌ను 300 శాతం వరకు పెంచుతుంది.

ఈ యాంటీనా నెట్‌వర్క్‌ బూస్ట్‌ చిప్‌ S1 తో జతచేసి ఉంటుంది. ఇది రియల్‌ టైమ్‌లో యాంటీనాలను ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్‌ చేస్తుంది. మరియు ఈ సెగ్మెంట్‌లోనే తొలి 5G++ సపోర్టు మరియు డ్యూయల్ సిమ్ డ్యూయల్‌ యాక్టివ్‌ ఫీచర్లుంటాయి. కాలింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌, నావిగేషన్‌ సమయాల్లో నిరంతర కనెక్టివిటీ ఉండేలా చూస్తుంది. ఎలివేటర్లు, బేస్‌మెంట్‌ సహా ఇతర మారుమూల ప్రాంతాల్లోనూ కనెక్టివిటీ సక్రమంగా ఉండేలా చూస్తుంది.

అవుట్‌డోర్ మోడ్ 2.0
డెలివరీ ఏజెంట్లు, గిగ్‌ వర్కర్స్‌ మరియు ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికోసం అవుట్‌డోర్ మోడ్‌ 2.0 ను తీసుకొచ్చింది. ఈ ఫీచ్‌ అవుట్‌డోర్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను పెంచుతుంది. క్లియర్‌ వాయిస్‌ అల్గారిథమ్‌తో కాల్ క్లారిటీని మెరుగుపరుస్తుంది. ఆర్డర్‌ రష్ బూస్ట్ ద్వారా జొమాటో లేదా స్విగ్గీ వంటి యాప్‌లకు నెట్‌వర్క్‌ బ్యాండ్‌విడ్త్‌ లో ప్రాధాన్యత ఇస్తుంది. దీంతోపాటు App keep Alive ఫీచర్‌ ద్వారా కీలకమైన యాప్‌లు మూసివేయకుండా నియంత్రిస్తుంది. స్క్రీన్‌ ఆన్ టైం కారణంగా కొన్ని అప్‌డేట్స్‌ కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

గ్లౌజ్‌ మోడ్‌ ఫీచర్‌తో గ్లౌజ్‌ ద్వారా ఫోన్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. మరియు స్ల్పాష్‌ టచ్‌ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫలితంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఫోన్‌ను ఉపయోగించుకొనేలా చేస్తుంది.

కెమెరా ఫీచర్లు
OPPO F31 Pro 5G స్మార్ట్‌ఫోన్ OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్‌ లెన్స్‌ను కలిగి ఉంది. ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. అదే OPPO F31 5G స్మార్ట్‌ఫోన్ 50MP OIS ప్రైమరీ కెమెరా, 2MP మోనోక్రోమ్‌ లెన్స్‌, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

ఇందులో Pro మోడల్‌ ముందు, వెనుక కెమెరాలు 4K వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తాయి. మరియు పై రెండు మోడల్స్‌ అండర్‌ వాటర్ ఫోటోగ్రఫీని కూడా సపోర్టు చేస్తాయి. ఫోటోలు, 4K వీడియోలను రికార్డు చేయవచ్చు.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

OPPO AI ఇమేజింగ్‌ ఇంజిన్ AI Perfect Shot, AI Recompose, AI Clarity Enhancer, AI Reflection Remover, A Unblur, AI Eraser 2.0 వంటి అనేక ఫీచర్‌లు తీసుకొచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫోటోలు, వీడియోలను క్యాప్చర్‌ చేసేందుకు సాయం చేస్తుంది.

స్మార్ట్‌ AI ఫీచర్లు
ఈ సిరీస్ ColorOS 15 పైన పనిచేస్తుంది. OPPO F31 5G సిరీస్‌ గూగుల్ జెమినీ తో ఇంటిగ్రేట్‌ చేయబడి ఉంటుంది. ఫలితంగా కేవలం స్మార్ట్‌ఫోన్‌గానే కాకుండా మీకు అన్నివేళలా సరైన తోడుగా నిలుస్తుంది. ఇందులో AI VoiceScribe, AI Call Translator, AI Call Summary, AI Assistant, AI Document Scan వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫీచర్‌లతో మాన్యువల్‌గా చేసే పనులను నియంత్రించడం సహా భాషపరమైన బేధాలను తగ్గిస్తుంది.

oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india

భద్రత పరంగానూ మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. దొంగలించబడినప్పుడు లేదా ఎక్కడైనా పొగొట్టుకున్నప్పుడు OPPO లాక్‌ ఫీచర్‌ మీ ఫోన్‌ను లాక్‌ చేసేందుకు సాయం చేస్తుంది. మీ ఫోన్‌ను ఇతరులు ఆఫ్‌ చేయకుండా, USB ద్వారా సమాచారం చోరీచేయకుండా, మాల్‌వేర్‌ ద్వారా మీ ఫోన్‌ను నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లకుండా ఈ ఫీచర్‌ రక్షణ కల్పిస్తుంది. ఫలితంగా ఫోన్ పోగొట్టుకున్నా.. వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుందనే భావన యూజర్లకు కలుగుతుంది.

OPPO సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు రెండు సంవత్సరాల OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఫలితంగా కొనుగోలు చేసిన కొన్ని సంవత్సరాల వరకు ఫోన్‌ను భద్రంగానే ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ యూజర్లు తమ ఫోన్‌ను ఎక్కువ కాలం ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వారికి ఈ అప్‌డేట్స్‌ ఉపయోగపడతాయి.

OPPO F31 సిరీస్ ధర, సేల్‌, పండుగల ఆఫర్ల వివరాలు
OPPO F31 సిరీస్ ప్రారంభ ధర రూ.22999 గా ఉంటుంది. అన్ని వేరియంట్స్‌ ధరల వివరాలు మీకోసం

OPPO F31 5G (8GB/128GB) రూ.22999
OPPO F31 5G (8GB/256GB) రూ.24999
OPPO F31 Pro 5G (8GB/128GB) రూ.26999
OPPO F31 Pro 5G (8GB/256GB) రూ.28999
OPPO F31 Pro 5G (12GB/256GB) రూ.30999
OPPO F31 Pro+ 5G (8GB/256GB) రూ.32999
OPPO F31 Pro+ 5G (12GB/256GB) రూ.34999

OPPO F31 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను ఆన్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌లతోపాటు ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు. OPPO e-Store, Flipkart, Amazon ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

అక్టోబర్‌ 31 2025 వరకు పండుగ ఆఫర్లు
పండుగ ఆఫర్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లతో OPPO F31 సిరీస్‌ను రూ.20700 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌, పాత స్మార్ట్‌ఫోన్‌లపై 10 శాతం ఎక్స్ఛేంజీ బోనస్‌ను పొందవచ్చు. జీరో డౌన్‌ పేమెంట్‌ ఆప్షన్, 8 నెలల వరకు నోకాస్ట్ EMI వంటి ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.

ఈ పండుగ ఆఫర్‌లతో OPPO F31 ప్రో మరియు F31 మోడల్స్‌ రూ.30000 ధర సెగ్మెంట్‌లోకి రానున్నాయి. ప్రీమియం మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో OPPO F31 Pro+ మోడల్‌ మెరుగైన ఆప్షన్ కానుంది.

చివరిగా :
OPPO F31 సిరీస్‌ మిడ్‌ రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్‌గా ఉంటుంది. IP69 వాటర్‌ ప్రూఫ్‌తో 18 ద్రవాల నుంచి రక్షణను కలిగి ఉంది. మిలిటరీ గ్రేడ్‌ డ్రాప్‌ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. భారీ బ్యాటరీ లైఫ్‌, మెరుగైన కనెక్టివిటీ, రియల్ వరల్డ్ సవాళ్లను తట్టుకొనే విధంగా స్లిమ్‌, స్టైలిష్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

OPPO F31 Pro 5G ఫుల్‌ ప్యాకేజీ ఫోన్‌గా ఉంటుంది. స్మూత్‌ పెర్ఫామెన్స్, ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుంది. అదే OPPO F31 5G రోజువారీ అన్నింటా తోడుగా ఉండే ఫోన్‌గా ఉంటుంది. మన్నిక, మెరుగైన పనితీరు అందించే ఫోన్‌ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
oppo f31 series arrives for the festive season engineered for durability powered for everyday india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X