ఒప్పో నుంచి F31 సిరీస్ విడుదల తేదీ వెల్లడి.. డ్యూరబుల్ ఛాంపియన్ గా..!
OPPO F31 Series Launch Date : ఒప్పో భారత్ మార్కెట్ లో ఒప్పో F31 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ విడుదల తేదీ వెల్లడయింది. ఈ సిరీస్ లో భాగంగా ఒప్పో F31, F31 ప్రో, F31 ప్రో ప్లస్ ఫోన్ లు అందుబాటులోకి రానుంది. గతంలో లాంచ్ అయిన K13 సిరీస్ తరహాలోనే త్వరలో విడుదల కానున్న F31 సిరీస్ కూడా అనేక అప్‌గ్రేడ్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సిరీస్ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలు.
ఎప్పుడు విడుదల కానుంది? :
భారత్ మార్కెట్ లో ఒప్పో F31 సిరీస్ సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ సిరీస్ మిడ్ రేంజ్ ధర సెగ్మెంట్ లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ ప్రారంభ ధర రూ.25 వేలుగా ఉంటుందని భావిస్తున్నారు. అదే హైఎండ్ మోడల్ ప్రో ప్లస్ ధర రూ.35000 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

డ్యూరబుల్ ఛాంపియన్ :
ఒప్పో F31 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లు డ్యూరబుల్ ఛాంపియన్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరియు రేడియల్ ప్యాట్రన్ తో కూడిన కెమెరా మాడ్యూల్, టెక్స్చర్డ్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంటుంది. ఈ ప్యాట్రన్ ఫోన్ గోల్డ్ లేదా షాంపైన్ కలర్ వేరియంట్ లో లభించే అవకాశం ఉంది.
వృత్తాకార కెమెరాల మాడ్యూల్స్ :
మరో వేరియంట్ డీప్ బ్లూ తో కూడిన టెక్స్చర్డ్ బ్యాక్ ప్యానల్ ఉంటుందని సమాచారం. మెరిసేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ఫ్లాట్ సైడ్స్ తో కూడిన వృత్తాకార కెమెరాల మాడ్యూల్స్ ను కలిగి ఉంటుంది. ఫలితంగా డిజైన్ పరంగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.
బేస్ వేరియంట్ :
ఒప్పో F31 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉంది. మరియు ఈ ఫోన్ 80W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫలితంగా ప్రస్తుతం భారీ బ్యాటరీలతో వస్తున్న ఫోన్‌లకు పోటీనిచ్చే అవకాశం ఉంది. గత మోడల్స్ తో పోలిస్తే అప్‌గ్రేడ్స్ గా భావించవచ్చు.
ప్రో మోడల్ :
ఈ సిరీస్ ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరియు 80W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. గత వేరియంట్ 6500mAh బ్యాటరీ మాత్రమే కలిగి ఉంది.
హైఎండ్ వేరియంట్ :
ఒప్పో 31 సిరీస్ ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 SoC చిప్‌సెట్ తో పనిచేసే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications