Home
Mobile

OPPO F31 Series Overview : మన్నిక, వేగం, మెరుగైన బ్యాటరీ లైఫ్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు పనితీరు, మన్నిక, విశ్వసనీయత కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే ఎంచుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం OPPO F31 సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది.

రోజువారి వినియోగదారుల కోసం F31 సిరీస్‌ రూపొందించబడింది. మన్నిక, దీర్ఘకాలిక విశ్వసనీయతే ప్రాధాన్యతలుగా బలమైన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ తో అందుబాటులో ఉంది. రోజువారి సవాళ్లను అదిగమించి నమ్మకమైన డివైజ్‌గా నిలుస్తుంది.

oppo f31 series overview bringing durability speed and all day battery to everyday indians

శక్తి, సమర్థవంతమైన పనితీరు
పనితీరు పరంగా OPPO F31 సిరీస్‌ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్‌లోని మూడు మోడళ్లు మల్టీ టాస్కింగ్‌, మెరుగైన గేమింగ్‌ అనుభూతిని అందించేలా చిప్‌లను కలిగి ఉన్నాయి. OPPO F31 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ఎనర్జీ చిప్‌సెట్, OPPO F31 Pro మోడల్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌, అదే OPPO F31 Pro+ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

భారతీయులకు పనితీరు అంటే కేవలం వేగం మాత్రమే కాదు. విశ్వసనీయత కూడా. అందువల్ల చిప్‌సెట్‌తోపాటు OPPO F31 సిరీస్‌ డ్యూయల్‌ ఇంజిన్‌ స్మూత్‌నెస్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా యాప్‌లు మరింత వేగంగా పనిచేస్తాయి. ఫోన్ పనితీరు మరింత వేగంగా ఉంటుంది.

దీంతోపాటు OPPO ట్రినిటీ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫీచర్‌ CPU క్యాచీ, ఇతర వనరులను మేనేజ్‌ చేస్తుంది. ఫలితంగా యాప్‌ ఇన్‌స్టాల్‌ సమయం 26 శాతం తగ్గుతుంది. మరియు అధిక బ్యాటరీ లైఫ్‌ వచ్చేలా చూస్తుంది. ఇతర యాప్‌లకు సులభంగా మారేందుకు సహకరిస్తుంది.

మెరుగైన థర్మల్‌ మేనేజ్‌మెంట్‌
OPPO F31 Pro+ స్మార్ట్‌ఫోన్‌ 5219mm Sq సూపర్‌ కూల్‌ VC సిస్టమ్‌ను కలిగి ఉంది. అదే F31 Pro మోడల్‌ 4363 mm Sq ఛాంబర్‌ను, F31 5G ఫోన్‌ 4300 mm Sq ఛాంబర్‌ను కలిగి ఉంది. గత వేరియంట్స్‌ కంటే భారీ VC ఛాంబర్‌ల కారణంగా థర్మల్‌ మేనేజ్‌మెంట్‌ మెరుగ్గా ఉంటుంది.

ఈ సిరీస్‌ +1 mA/౦ C కారణంగా మల్టీ టాస్కింగ్‌ సమయంలోనూ కూలింగ్‌ సక్రమంగా ఉండేలా చూస్తుంది. ఫలింగా గేమింగ్‌, నేవిగేషన్‌ సహా ఇతర సమయాల్లోనూ పనితీరు మెరుగ్గానే ఉంటుంది. ఓవర్‌ హీటింగ్‌ అనే సమస్యే ఉత్పన్నం కాదు. AnTuTU, SGS రెండింటి కారణంగా OPPO F31 సిరీస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌ వంటి అధిక ఉష్ణోగ్రతల సందర్భాల్లోనూ స్థిరమైన ఫ్రేమ్‌ రేట్, యానిమేషన్‌, సక్రమమైన స్పందనను కలిగి ఉంటుంది.

oppo f31 series overview bringing durability speed and all day battery to everyday indians

సమర్థవంతమైన చిప్‌, అత్యాధునిక కూలింగ్‌ సిస్టమ్‌ కారణంగా 72 నెలల వరకు మెరుగైన పనితీరునే అందిస్తుంది. OPPO ల్యాబ్స్‌ను దీన్ని ధ్రువీకరించాయి. F31 సిరీస్‌ అత్యంత తీవ్రమైన పరిస్థితుల్లోనూ మెరుగైన పనితీరును అందించే విధంగా రూపొందించబడింది. వన్ క్లిక్ రిజువనేషన్‌ ద్వారా ఇది సాధ్యమవుతుంది. రీఫ్రెష్‌ చేసిన తర్వాత 15 శాతం వరకు పనితీరు మెరుగుపడుతుంది. అత్యధికంగా ఉపయోగించే ఐదు యాప్‌ల లాంచ్‌ టైం 20 శాతం వరకు మెరుగుపడుతుంది.

OPPO F31 సిరీస్‌ రోజువారీ సవాళ్లను అధిగమిస్తూ, మెరుగైన పనితీరు, దీర్ఘకాలం స్మూత్‌ ఫెర్ఫా్మెన్స్‌ను కోరుకొనే యూజర్లకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

మెరుగైన బ్యాటరీ పనితీరు
OPPO F31 5G, OPPO F31 Pro 5G స్మార్ట్‌ఫోన్ 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. 5 సంవత్సరాల వరకు మెరుగైన పనితీరును అందిస్తాయి. ఈ ఫోన్లు 80W SUPERVOOC ఫ్లాష్‌ ఛార్జ్‌ సపోర్టును కలిగి ఉన్నాయి. కేవలం 30 నిమిషాల్లో 58 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు. గరిష్ఠంగా 43 డిగ్రీల సెల్సియస్, -20 డిగ్రీల సెల్సియస్ లోనూ ఈ ఫోన్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్ సక్రమంగా పనిచేస్తుంది.

oppo f31 series overview bringing durability speed and all day battery to everyday indians

ఈ సిరీస్‌ బయోనిక్‌ రిపేర్‌ టెక్నాలజీ ఆధారిత బైపాస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. సుదీర్భమైన గేమింగ్ సందర్భాల్లోనూ మెరుగైన పనితీరునే అందిస్తుంది. ఎక్కువ సంవత్సరాల మన్నిక వచ్చే విధంగా ఈ ఫోన్‌ సొలిడ్‌ ఎలక్ట్రోలైట్ ఇంటర్‌ఫేస్‌ మెంబ్రేన్‌ను కలిగి ఉంటుంది.

ప్రస్తుత గిగ్‌ వర్కర్లు, యువ నిపుణులు సహా ఇతర అవసరాలకు అనుగుణంగా OPPO F31 సిరీస్‌ రోజంతా మెరుగైన పనితీరును అందించే విధంగా రూపొందించబడింది.

కనెక్టివిటీ పరంగానూ బెస్ట్
OPPO F31 సిరీస్‌ అన్ని పరిస్థితుల్లోనూ స్థిరమైన నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఈ సిరీస్‌ OPPO యొక్క హంటర్‌ యాంటెన్నా ఆర్కిటెక్చర్‌ ను కలిగి ఉంటుంది. ఫలితంగా సిమెట్రిక్‌ లో ఫ్రెక్విన్సీ యాంటెన్నాల ద్వారా 91.6 శాతం కవరేజీని అందిస్తుంది. అంటే గతానికంటే 300 శాతం బలమైన సిగ్నల్స్‌ ను అందిస్తుంది. ఎంత రద్దీ అయిన ప్రాంతాల్లోనైనా మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది.

oppo f31 series overview bringing durability speed and all day battery to everyday indians

దీంతోపాటు ఈ సిరీస్‌ నెట్‌వర్క్‌బూస్ట్‌ చిప్‌ S1 ను కూడా కలిగి ఉంది. రియల్ టైం అవసరాలను గుర్తించి, సిగ్నల్‌ స్థిరత్వం కోసం ఆటోమేటిక్‌గా ట్యూన్‌ చేస్తుంది. ఎలివేటర్లు, బేస్‌మెంట్‌ సహా ఇతర తక్కువ నెట్‌వర్క్ ఉండే ప్రాంతాల్లోనూ మెరుగైన కనెక్టివిటీని అందించే విధంగా TUV Rheinland సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. మరియు మెరుగైన కనెక్టివిటీని అందించే డివైజ్‌గా జియో నిర్ధారించింది. గిగ్‌ వర్కర్లు మరియు దుకాణదారులు అత్యంత ముఖమైన సమయాల్లో కనెక్టెడ్‌ గా ఉండేలా OPPO F31 5G, F31 Pro 5G పనిచేస్తాయి. డ్యూయల్‌ సిమ్, డ్యూయల్‌ యాక్టివ్, 5G++ సపోర్టును కలిగి ఉంటుంది. కాల్స్‌, యాప్‌, డేటా మధ్య నిరంతరం మారుతున్నా కనెక్టివిటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

రోజువారీ అవసరాలకు అనుగుణంగా బిల్ట్‌ ఇన్‌ సెఫ్టీ
భారత శ్రామిక శక్తి ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, భద్రత, సౌలభ్యం కోసం OPPO సెక్యూరిటీ లేయర్‌లను జతచేసింది. ఇందుకోసం OPPO Lock ఫీచర్‌ ను తీసుకొచ్చింది. మీరు ఫోన్‌ను పొగొట్టుకున్నా లేదా దొంగలించబడిన సందర్భాల్లో రిమోట్‌గా మీ డివైజ్‌ను లాక్‌ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. ఫోన్‌ను స్వీచ్‌ ఆఫ్‌ చేయడంగానీ, USB, మాల్‌వేర్‌ ద్వారా గానీ మీ వ్యక్తిగత డేటా చోరీ కాకుండా కాపాడుతుంది. సిమ్ కార్డు తీసివేసిన సందర్భాల్లో టూ స్టెప్ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

అయితే గిగ్‌ వర్కర్ల కోసం అవుట్‌డోర్ 2.0 ఫీచర్‌ను కలిగి ఉంటుంది. రైడర్‌ యాప్‌లను ఆప్టిమైజ్‌ చేస్తుంది. ఎక్కువ కాంతి ఉన్న ప్రాంతాల్లోనూ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను సర్దుబాటు చేస్తుంది. దీంతోపాటు గ్లౌజ్‌, స్ప్లాష్‌ టచ్‌ ఫీచర్‌లను కూడా సపోర్టు చేస్తుంది. అంటే 5mm థిక్‌నెస్‌ కలిగిన గ్లౌజ్‌లను ధరించినప్పుడు కూడా ఫోన్‌ను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.

oppo f31 series overview bringing durability speed and all day battery to everyday indians

OPPO F31 సిరీస్ ధర
OPPO F31 ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది. అదే 256GB వేరియంట్ ధర రూ.24999 గా ఉంది. ఈ ఫోన్ మిడ్‌నైట్‌ బ్లూ, క్లౌడ్‌ గ్రీన్, బ్లూమ్‌ రెడ్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అదో F31 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26999 గా ఉంది. 8GB/256GB వేరియంట్ ధఱ రూ.28999, 12GB/256GB వేరియంట్ ధర రూ.30999 గా ఉంది. ఈ ఫోన్ స్పేస్ గ్రే, డిజర్ట్‌ గోల్డ్ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

OPPO F31 Pro+ స్మార్ట్‌ఫోన్ 8GB/256GB ధర రూ.32999, 12GB/256GB ధర రూ.34999 గా ఉంది. ఈ ఫోన్ జెమ్‌స్టోన్ బ్లూ, హిమాలయన్‌ వైట్‌, ఫెస్టివ్‌ పింక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది. OPPO F31 సిరీస్‌ ను ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్‌లతోపాటు OPPO E-Store, Flipkart, Amazon లోనూ కొనుగోలు చేయవచ్చు.

ఫెస్టివ్‌ సీజన్‌ ఆఫర్లతో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై ఈ సిరీస్‌ బేస్‌ వేరియంట్‌ను రూ.20700 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు 10 శాతం అదనపు డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. మరియు 10 శాతం ఎక్స్ఛేంజీ బోనస్‌ను కూడా పొందవచ్చు. జీరో డౌన్‌ పేమెంట్, 8 నెలల వరకు నో కాస్ట్‌ EMI ఆప్షన్‌లను పొందవచ్చు. ఈ పండుగ ఆఫర్లతో F31, F31 Pro మోడల్స్‌ రూ.30 వేల ధర రేంజ్‌లో బెస్ట్ మోడల్స్‌గా ఉంటాయి. అదే F31 Pro+ స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం మిడ్‌ రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్‌గా ఉంటుంది.

మంచి ఆప్షన్‌
OPPO F31 5G, F31 Pro 5G స్మార్ట్‌ఫోన్ రోజువారీ సవాళ్లు, సక్రమంగా లేని నెట్‌వర్క్, అధిక సంఖ్యలో యాప్స్‌ వినియోగం కోసం రూపొందించబడింది. ఈ హ్యాండ్‌సెట్‌ పనితీరు, మన్నిక, ఆకట్టుకొనే డిజైన్‌ యొక్క స్మార్ట్‌ బ్యాలెన్స్‌ను కలిగి ఉంది. శక్తివంతమైన చిప్‌లు, అధునాతమైన కూలింగ్ సిస్టమ్‌, OPPO యొక్క ట్రినిటీ ఇంజిన్‌ మొత్తంగా మల్టీ టాస్కింగ్‌ కోసం మెరుగైన ఆప్షన్‌గా నిలుపుతుంది.

oppo f31 series overview bringing durability speed and all day battery to everyday indians

ఈ ఫోన్‌లు 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. హంటర్‌ యాంటెన్నా ఆర్కిటెక్చర్, నెట్‌వర్క్‌బూస్ట్‌ చిప్‌ S1. TUV సర్టిఫైడ్‌ కనెక్టివిటీ సర్టిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. బలహీనమైన నెట్‌వర్క్‌ కలిగిన ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి. దీంతోపాటు OPPO Lock, అవుట్‌డోర్ మోడ్ 2.0, గ్లౌజ్‌ మోడ్‌, స్ల్పాష్‌ టచ్‌ వంటి అనేక ఆప్షన్లు ఉన్నాయి.

ప్రధానంగా OPPO F31 సిరీస్‌ భారత్‌లోని డైనమిక్ వర్క్‌ఫోర్స్‌కు మద్ధతు ఇవ్వడానికి మరియు భద్రత, మెరుగైన పనితీరును మిళితం చేసి అత్యంత విశ్వసనీయమైన డివైజ్‌ను అందించడానికి రూపొందించబడింది.

More from GizBot

Best Mobiles in India

English summary
oppo f31 series overview bringing durability speed and all day battery to everyday indians
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X