OPPO నుంచి త్వరలో మూడు స్మార్ట్‌ఫోన్‌లు.. 7000mAh భారీ బ్యాటరీ సహా కీలక వివరాలు లీక్..!
Oppo F31 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలో ఒప్పో F31 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో ఒప్పో F31, ఒప్పో F31 ప్రో, F31 ప్రో ప్లస్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన F29 సిరీస్ కు తర్వాత తరం వెర్షన్‌గా విడుదల కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి.
ఎప్పుడు విడుదల కానుంది?
ఇటీవల వచ్చిన లీక్స్ ఆధారంగా ఒప్పో F31 స్మార్ట్‌ఫోన్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 14 మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఒప్పో F31 సిరీస్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ X పోస్ట్ ద్వారా ఈ అంచనా వివరాలను వెల్లడించారు.

ఒప్పో F31 స్మార్ట్‌ఫోన్ స్క్వేర్ ఆకారంలో కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 80W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. రెడ్, పర్పుల్, బ్లూ కలర్స్‌లో లభిస్తుందని తెలుస్తోంది.
ఒప్పో F31 ప్రో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 80W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. అదే ప్రో మోడల్ గోల్డ్, బ్లాక్ కలర్ వేరియంట్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అదే ప్రో ప్లస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh బ్యాటరీతో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఒప్పో F31 ప్రో ప్లస్ వేరియంట్ వైట్, పింక్, బ్లూ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
Oppo F31, F31 Pro, and F31 Pro+ first look. ✅
— Abhishek Yadav (@yabhishekhd) August 24, 2025
F31 Pro+ specifications
📱 Flat display
🔳 Qualcomm Snapdragon 7 Gen 3 processor
🔋 7000mAh battery
- 12GB+256GB
Oppo F31 specifications
🔳 MediaTek Dimensity 6300
🔋 7000 mAh battery
⚡ 80 watt charging
Oppo F31 Pro… pic.twitter.com/LW0Aa4OPGB
* ఇటీవలే ఒప్పో నుంచి K13 టర్బో సిరీస్ విడుదల అయింది. K13 టర్బో, K13 టర్బో ప్రో మోడల్స్ లాంచ్ అయ్యాయి. ప్రో మోడల్‌ను ఒప్పో ఇండియా స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రో మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.37,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.39,999 గా ఉంది.
ఒప్పో K13 టర్బో స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.27999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.29999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.8 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.
ఒప్పో K13 టర్బో సిరీస్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. మరియు థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇన్‌బిల్ట్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 7000 sq mm వేపర్ కూలింగ్ ఛాంబర్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








