Oppo F5 లాంచ్ అయ్యింది, ధర రూ.19,990

|

భారీ అంచనాల మధ్య Oppo F5 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. మొత్తం రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ +32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.19,990. 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.24,990.

Oppo F5 with 20MP selfie camera with AI beauty feature launched in India starting from Rs. 19,990

నవంబర్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారభమవుతుంది. ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పూర్తిస్థాయి బీజిల్-లెస్ (ఎడ్జ్ టు ఎడ్జ్) డిస్‌ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే సెల్ఫీ కెమెరా ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.

20 మెగా పిక్సల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెల్ఫీ కెమెరా..

20 మెగా పిక్సల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెల్ఫీ కెమెరా..

Oppo F5 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌తో వస్తుందని అందరూ భావించారు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ ఫోన్ 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో విడుదలైంది. ఈ కెమెరాలో నిక్షిప్తం చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీ సెల్ఫీ షాట్‌లను మరింత అందంగా తీర్చిదిద్దే క్రమంలో 200కు పైగా ఫేషియల్ రికగ్నిషన్ స్పాట్‌లను స్కాన్ చేసుకుంటుందట.

ఈ టెక్నాలజీ bokeh ఎఫెక్ట్స్‌ను కూడా ప్రొవైడ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. పిక్షర్ పర్‌ఫెక్ట్ సెల్ఫీ షాట్‌లను రాబట్టే క్రమంలో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టక్నాలజీ, బెస్ట్ బ్యూటీ సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవటంతో పాటు సబ్జెక్ట్ స్కిన్ కలర్, స్కిన్ టోన్, జెండర్ ఇంకా ఏజ్‌ను డిటెక్ట్ చయగలుగుతుంట. ఈ కెమెరాతో తక్కువ వెళుతురు కండీషన్స్‌లో సైతం బెస్ట్ క్వాలిటీ సెల్ఫీలను రాబట్ట వచ్చని ఒప్పో చెబుతోంది.

Oppo F5 డిజైన్ అండ్ డిస్‌ప్లే

Oppo F5 డిజైన్ అండ్ డిస్‌ప్లే

ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్, 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ బీజిల్-లెస్ డిస్‌ప్లే (18:9 కారక నిష్పత్తి)తో వస్తోంది. బీజిల్-లెస్ డిజైన్ కారణంగా డిస్‌ప్లే సైజు పెద్దదిగా అనిపిస్తుంది. లక్ ఇంకా ఫీల్ పరంగా చాలా కాంపాక్ట్‌గా కనిపించే ఈ స్మార్ట్‌ఫోన్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఆపరేట్ చేయవచ్చు. మెటల్ యునిబాడీతో వస్తోన్న ఈ ఫోన్ వెనుక భాగంలో 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేయటం జరిగింది.

మార్కెట్లోకి Redmi Y1, Redmi Y1 Liteమార్కెట్లోకి Redmi Y1, Redmi Y1 Lite

హార్డ్‌వేర్ ఫీచర్స్..

హార్డ్‌వేర్ ఫీచర్స్..

ప్రాసెసింగ్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్ MediaTek MT6737T chipset పై రన్ అవుతుంది. మొత్తం రెండు రకాల వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ ఫోన్‌లో లోడ్ చేసిన 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సుధీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేస్తుందని ఒప్పో చెబుతోంది.

 సాఫ్ట్‌వేర్ ఇంకా కనెక్టువిటీ ఫీచర్స్..

సాఫ్ట్‌వేర్ ఇంకా కనెక్టువిటీ ఫీచర్స్..

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 ఆధారిత ColorOS 3.2 వర్షన్ పై రన్ అవుతుంది. 4G VoLTE, వై-ఫై, బ్లుటూత్ 4.1, డ్యుయల్ సిమ్ సపోర్ట్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo F5 with a 20MP front-facing camera with AI beauty recognition technology has been launched in India at Rs. 19,990

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X