నవంబర్ 2న ఇండియాకి సెల్ఫీ కింగ్ oppo f5 స్మార్ట్‌ఫోన్..
సెల్ఫీ ప్రియులను మరింత ఆకర్షించేందుకు చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఒప్పో సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
సెల్ఫీ ప్రియులను మరింత ఆకర్షించేందుకు చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఒప్పో సరికొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో 20 ఎంపీ ముందు కెమెరా కలిగిన ఒప్పో ఎఫ్5 ఫోన్‌ను ఆవిష్కరించింది. కాగా రెండు స్టోరేజ్ ఆప్షన్లను ఈ ఫోన్ కలిగి ఉంది. ఒకటి 4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్.

ఎరుపు రంగులో 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కున్న మరో ప్రత్యేకత. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌లో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. నవంబర్ 2న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దీని ధర సుమారు రూ.20వేలు ఉండొచ్చని సమాచారం.

ఒప్పో ఎఫ్5 స్పెషిఫికేషన్లు...
ఏఐ-ఎనాబుల్డ్ బ్యూటీ టెక్నాలజీ
20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
6 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే విత్ ఫుల్-హెచ్‌డీ ప్లస్ స్క్రీన్
ఆక్టా-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్
256జీబీ వరకు విస్తరణ మెమరీ
ఆండ్రాయిడ్ 7.1 నౌగట్
3200 ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








