OPPO F7లో కెమెరాలో దాగిన సీక్రెట్ ఫీచర్స్ ఇవే !

Written By:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో నాట్చ్ డిస్‌ప్లేదే అగ్రస్థానం. ఐఫోన్ ఎక్స్‌ వినియోగదారులను బాగా ఆకట్టుకోవడంతో మిగతా మొబైల్ కంపెనీలు కూడా ఈ రకమైన మొబైల్స్‌నే తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వివో వీ9, మోటో ఎక్స్‌ 4, హానర్‌ 8 ప్రొ లాంటి ఫోన్లు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒప్పో సంస్థ కూడా నాట్చ్ డిస్‌ప్లేలో సెల్ఫీ ఎక్స్‌ఫర్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉండి మిగతా ఫోన్లకు గట్టి పోటీని ఇచ్చేందుకు ఒప్పో సిద్ధమైంది. ఎరువు, తెలుపు రంగులతో పాటు డైమండ్‌ బ్లాక్‌, సన్‌రైజ్‌ రెడ్‌ వంటి ప్రత్యేక వెర్షన్లను సైతం విడుదల చేసింది.

సొంత‌ స్మార్ట్‌ఫోన్ ఆశలో కుప్పకూలిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లో లైట్ కండిషన్లో ..

ఎఫ్‌ 5కి సక్సెసర్‌గా వచ్చిన ఈ ఫోన్ లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను అద్భుతంగా తీయగల కెమెరాతో దూసుకువచ్చింది.అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ బ్యూటికేషన్ ఏడు దశల్లో, రెండు స్కిన్ టోన్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు లాంచింగ్‌ సందర్భంగా కంపెనీ వెల్లడంచింది

సెల్ఫీ ప్రియులకు

సెల్ఫీ ప్రియులకు ఇది అత్యుత్తమ బ్యూటిఫికేషన్ ఎడిట్స్ ని అందించేలా ఒప్పో ఎఫ్7 ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుంది. స్కిన్‌తోపాటు కళ్లు, వెంట్రుకలను సైతం మరింత అంతంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు ఈస్మార్ట్‌ఫోన్‌ జెండర్‌ను కూడా గుర్తిస్తుందట. ఏఆర్ స్టిక్కర్, స్నాప్ చాట్ ద్వారా ఆటలను కూడా ఆడుకోవచ్చు.

25 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

ఇందులో 25 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండటంతో అత్యంత నాణ్యమైన సెల్పీలను దిగే అవకాశం ఉంటుంది. నాటరిక్ ఇమేజ్ సెన్సార్ కారణంగా ఫొటోలు ఎంతో స్పష్టంగా, వేగంగా తీసుకోవచ్చు. ఎఫ్7లో నెక్ట్స్ జనరేషన్ సెన్సార్-హెచ్‌డీఆర్, రంగులను స్పష్టంగా గుర్తించి స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీస్తుంది. లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను ఇతర ఫోన్ కెమెరాల కంటే అద్భుతంగా తీయగలదు.

ఫొటో ఆల్బమ్ అప్లికేషన్స్

ఎఫ్7 అద్భుతమైన విధంగా 6.23 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ(1080x2280 పిక్సెల్స్) డిస్‌ప్లే, సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో. స్క్రీన్ పెద్దదిగా ఉండటం వల్ల గేమ్స్ ఆడుకోవడం కానీ, చదువుకోవడం గానీ సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక, చేతులో ఇమిడే విధంగా ఉంది. ఏఐ పవర్డ్ ఎడిటింగ్, ఫొటో ఆల్బమ్ అప్లికేషన్స్ ఫీచర్లు దీనికి అదనంగా ఉన్నాయి. కవర్ షాట్, ఏఆర్(అనుబంధ వాస్తవికత) స్టిక్కర్స్ లతో యూజర్‌ని పర్సనల్ బ్యూటీ ఆర్టిస్టుగా తయారు చేస్తాయి. కవర్ షాట్ ఫీచర్ ద్వారా సెల్ఫీ కలర్‌ను కోరుకున్న విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఫీచర్లు, ధర

సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో వస్తున్న ఈ ఎఫ్7 సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌ 4/6జీబీ వేరియంట్లో లభ్యం కానున్న ఈ ఫోన్ 4జీబీ వేరియంట్‌ ధర రూ. 21,990గా ఉండగా, 6జీబీ వేరియంట్‌ రూ. 26,990గా ఉంది.
ఒప్పో ఎఫ్‌7 ఫీచర్లు
6.23 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీడిస్‌ప్లే
1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
4జీబీర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16ఎంపీ రియర్‌ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OPPO F7 AI camera is full of hidden gems for photography buffs More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot