Home
Mobile

ఒప్పో ఎఫ్7 , ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియాలో ఈ ఏడాది తన తొలి స్మార్ట్‌ఫోన్ Oppo F7ని లాంచ్ చేసింది. ఎఫ్ సీరిస్ లో ఫర్ఫెక్ట్ సెల్పీ కెమెరాను ఇండియాలో లాంచ్ చేసింది.

By Hazarath Aiah

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియాలో ఈ ఏడాది తన తొలి స్మార్ట్‌ఫోన్ Oppo F7ని లాంచ్ చేసింది. ఎఫ్ సీరిస్ లో ఫర్ఫెక్ట్ సెల్పీ కెమెరాను ఇండియాలో లాంచ్ చేసింది. Oppo F1, F3, F5లు ఇప్పటికే ఇండియా మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో నాలుగో ఫోన్ గా Oppo F7 ఇండియా మార్కెట్లోకి దిగింది. సోలార్ రెడ్, స్టార్రీ బ్లూ, మూన్ లైట్ సిల్వర్ వేరియంట్లలో వచ్చిన ఈఫోన్ లో ప్రధాన ఆకర్షణ సెల్ఫీ నే. 25 ఎంపీ సెల్ఫీతో పాటు ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో దూసుకువచ్చింది. లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను అద్భుతంగా తీయగల కెమెరా ఈ డివైఎస్‌ ప్రత్యేకతగా కంపెనీ చెప్పింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ బ్యూటికేషన్ ఏడు దశల్లో, రెండు స్కిన్ టోన్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు లాంచింగ్‌ సందర్భంగా కంపెనీ వెల్లడంచింది. 4/64 జీబీ వేరియంట్‌ ధర రూ. 21,990గా ఉండగా, 6/128 జీబీ వేరియంట్‌ రూ. 26,990గా ఉంది.

ఒప్పో ఎఫ్7 ఫీచర్లు
6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

OPPO F7

AI Beauty technology 2.0తో 25 ఎంపీ సెల్పీ కెమెరా
ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ సెల్ఫీ కెమెరా. 25 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సౌకర్యంతో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. సెల్ఫీ సెగ్మెంట్లో ఈ ఫోన్ ఓ సంచలనం అవుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. నాటరిక్ ఇమేజ్ సెన్సార్ కారణంగా ఫొటోలు ఎంతో స్పష్టంగా, వేగంగా తీసుకోవచ్చు. ఎఫ్7లో నెక్ట్స్ జనరేషన్ సెన్సార్-హెచ్‌డీఆర్, రంగులను స్పష్టంగా గుర్తించి స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీస్తుంది.

సెల్ఫీ ప్రియులకు ఇది అత్యుత్తమ బ్యూటిఫికేషన్ ఎడిట్స్ ని అందించేలా ఒప్పో ఎఫ్7 ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుందని తెలిపింది. స్కిన్‌తోపాటు కళ్లు, వెంట్రుకలను సైతం మరింత అంతంగా కనిపించేలా చేస్తుందట. అంతేకాదు ఈస్మార్ట్‌ఫోన్‌ జెండర్‌ను కూడా గుర్తిస్తుందట. అలాగే సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో వచ్చింది.

OPPO F7

ఒప్పో నుంచి 19:9 Aspect ratio screenతో దూసుకువస్తున్న ఫోన్ ఇదే. 6.2" Full HD+ display with a 2280 x 1080p resolutionతో యూజర్లు అదిరిపోయో డిస్ ప్లే వ్యూయింగ్ అనుభూతిని పొందుతారు. ఎక్కడా మీకు అంతరాయం లేకుండా స్క్రీన్ లో మీరు చూడాలనుకున్న కంటెంట్ ఈ ఫీచర్ ద్వారా చూడవచ్చు.

6.23 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ X తరహాలో నాచ్‌ను అమర్చారు. ఇక ఫోన్ ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్‌లో మెమొరీ కార్డుతోపాటు రెండు సిమ్ కార్డుల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు. రెండు సిమ్ కార్డులు కూడా వీవోఎల్‌టీఈని సపోర్ట్ చేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO F7: Everything you should know about the new Selfie Expert in town more news at Gizot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X