స్టార్ క్రికెటర్లు తోడుగా, ఇండియన్ మార్కెట్లోకి OPPO F7 గ్రాండ్ ఎంట్రీ

మార్చి 26న ముంబైలో జరిగిన ఈవెంట్ ద్వారా ఒప్పో లేటెస్ట్ సెల్పీ స్మార్ట్‌ఫోన్ OPPO F7 ఇండియా మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

|

మార్చి 26న ముంబైలో జరిగిన ఈవెంట్ ద్వారా ఒప్పో లేటెస్ట్ సెల్పీ స్మార్ట్‌ఫోన్ OPPO F7 ఇండియా మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 4జిబి/6జిబి వేరియంట్లలో 25 ఎంపీ ఇంటిలిజెంట్ ఏఐ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా, edge-to-edge displayతో OPPO F7 లాంచ్ అయింది. యూజర్లకు అదిరిపోయే మల్టీమీడియా అనుభూతిని అందించేందుకు ఈ ఫోన్ రెడీ అయిందని కంపెనీ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 4GB RAM + 64GB ROM వేరియంట్ ధర రూ. 21990గా, 6GB RAM + 128GB ROM వేరియంట్ ధర రూ. 26,990గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 9 నుంచి అన్ని ఆన్ లైన్ , ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. కాగా ఏప్రిల్ 2న కంపెనీ ఫ్లాష్ సేల్ నిర్వహించేందుకు రెడీ అయింది. లాంచింగ్ సమయంలో కంపెనీ తెలిపిన హైలెట్ పాయింట్స్ పై ఓ లుక్కేయండి.

Will Yang, Brand Director, OPPO India on stage
గతేడాది వచ్చిన ఒప్పో ఎఫ్5 సీరిస్ విజయవంతమైన నేపథ్యంలో ఈ ఫోన్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా పోగ్రాంకి సహాయ సహకారాలు అందించే దిశగా ఒప్పో ప్రయాణం సాగుతుందని ఆయన తెలిపారు. కాగా OPPO's global expansion in 2017ను రష్యా, జపాన్ వంటి దేశాల్లో కూడా లాంచ్ చేస్తామని తెలిపారు. 30 అంతర్జాతీయ మార్కెట్లలో యువతే లక్ష్యంగా global expansion పోగ్రాములు లాంచ్ చేస్తామని అన్నారు.

oppo f7

Heavy investments in motion in R&D in 2018
కాగా ఒప్పో తన పార్టనర్ Qualcommతో కలిసి 5జీ మీద కసరత్తులు చేస్తోంది. అలాగే గూగుల్ తో కలిసి గూగుల్ అసిస్టెంట్ ని తీసుకొస్తోంది. అలాగే R&D,Artificial Intelligence రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. AI-related patents ఇప్పుడు ఒప్పో దగ్గర 370 దాకా ఉన్నాయి. అలాగే smartphone patents 20,522 దాకా ఉన్నట్లు తెలిపింది.

Rishabh Srivastava, OPPO India product manager on stage
సెల్పీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోఒప్పో ఓ సంచలనం సృష్టిస్తుందని రిషబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కూడా సెల్ఫీ అభిమానులను కట్టిపడేస్తుందని అత్యంత తక్కువ వెలుతురులో కూడా అదిరిపోయే సెల్ఫీలు తీసుకునే విధంగా ఒప్పో ఫోన్లు ఉంటాయని తెలిపారు. ఎఫ్7లో నెక్ట్స్ జనరేషన్ సెన్సార్-హెచ్‌డీఆర్, రంగులను స్పష్టంగా గుర్తించి స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీస్తుంది. ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుందని తెలిపింది. స్కిన్‌తోపాటు కళ్లు, వెంట్రుకలను సైతం మరింత అందంగా కనిపించేలా చేస్తుందట. అంతేకాదు ఈస్మార్ట్‌ఫోన్‌ జెండర్‌ను కూడా గుర్తిస్తుందట. అలాగే సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో వచ్చిందని ఆయన తెలిపారు.

oppo f7

OPPO F7 Specifications
6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

oppo f7

ఇండియా క్రికెటర్లు Rohit Sharma, Hardik Pandya, Ravichandran Ashwinలు ఈ ఈవెంట్లో సందడి చేశారు. OPPO India Sales Director- Madhav Shethతో కలిసి ఈ స్టార్ క్రికెటర్లు తమ అనుభవాలను ఈ వేదికమీద పంచుకున్నారు.

Best Mobiles in India

English summary
OPPO F7 made its grand entry in Indian market with Star Indian Cricketers More news at Telugu Gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X