ఒప్పో ఎఫ్7పై మూడు వేలు తగ్గింపు, హైఎండ్ ఫీచర్లు ఇవే !

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం ఒప్పో తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఎఫ్‌7 పై ధర తగ్గించింది.

|

చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం ఒప్పో తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఎఫ్‌7 పై ధర తగ్గించింది. గతేడాది 22,990 రూపాయలకు లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను 3 వేల రూపాయలు తగ్గించి, 19,990 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. కంపెనీ ధర తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,200 వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను అందించనున్నామని, నెలకు రూ.664 ఈఎంఐ ఆఫర్‌ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.

 

నిలిచిపోనున్న ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈ, అభిమానుల్లో కలవరం !నిలిచిపోనున్న ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈ, అభిమానుల్లో కలవరం !

క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు..

క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు..

యాక్సిస్‌ బ్యాంక్‌ బుజ్‌ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు తమ బుజ్‌ క్రెడిట్‌ కార్డుపై 5 శాతం తగ్గింపు, వీసా కార్డు యూజర్లకు తొలి మూడు ఆన్‌లైన్‌ పేమెంట్లపై 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది.

రెండు వేరియంట్లలో..

రెండు వేరియంట్లలో..

ఒప్పో ఎఫ్‌7 రెండు వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఒకటి 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, రెండు 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌. ధర తగ్గింపుతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు రూ.19,990కు, రూ.23,990కు లభ్యమవనున్నాయి.

ఒప్పో ఎఫ్7 ఫీచర్లు
 

ఒప్పో ఎఫ్7 ఫీచర్లు

6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

6.23 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లే

6.23 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లే

6.23 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ X తరహాలో నాచ్‌ను అమర్చారు. ఇక ఫోన్ ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్

6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్‌లో మెమొరీ కార్డుతోపాటు రెండు సిమ్ కార్డుల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు. రెండు సిమ్ కార్డులు కూడా వీవోఎల్‌టీఈని సపోర్ట్ చేస్తాయి.

వన్‌ప్లస్ తన వన్ ప్లస్ 6 రెడ్ ఎడిషన్..

వన్‌ప్లస్ తన వన్ ప్లస్ 6 రెడ్ ఎడిషన్..

ఇదిలా ఉంటే వన్‌ప్లస్ తన వన్ ప్లస్ 6 రెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.2వేల తగ్గింపు ధరకు అందివ్వనుంది. ఈ నెల 16వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ ఆరంభం కానుందనే విషయం తెలిసిందే. ఆ సేల్‌లో ఈ ఫోన్‌ను తగ్గింపు ధరకు ఇవ్వనున్నారు.

 హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును

హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును

అయితే వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతో వినియోగదారులకు రూ.2వేలు క్యాష్‌బ్యాక్ రూపంలో వస్తాయి.

8 జీబీ ర్యామ్

8 జీబీ ర్యామ్

వన్ ప్లస్ తన వన్ ప్లస్ 6 రెడ్ ఎడిషన్‌ను గత నెలలోనే విడుదల చేసింది. ఇందులో 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లు లభిస్తున్నాయి. వినియోగదారులు ఈ ఫోన్‌ను రూ.39,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
Oppo F7 gets price cut in India by Rs 3000 on Amazon India and Flipkart More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X