సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దూసుకొస్తున్న OPPO F7 , మార్చి26న ముహుర్తం

  ఒప్పో అంటేనే సెల్ఫీ ఫోన్లకు పెట్టింది పేరు. ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఫోన్ సెల్ఫీ రారాజుగా ఉంటుంది. OPPO F5, OPPO F3 Plus, OPPO A83 లాంటి ఫోన్లు సెల్పీ మేకర్లుగా ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. కంపెనీ నుంచి రానున్న కొత్త ఫోన్లు సైతం సెల్ఫీ కింగులుగా దర్శనమివ్వబోతున్నాయి. ఈ నేఫథ్యంలోనే ఒప్పో నుంచి 25 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఒప్పో ఎఫ్7 దూసుకురానుంది. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇండియా మార్కెట్లోకి ఇది ఈ నెల 26న దూసుకురానుంది. కంపెనీ దీన్ని అట్టహాసంగా జరిగే వేడుకలో లాంచ్ చేయనుంది. మరి ఈ ఫోన్ నుంచి యూజర్లు ఏం ఆశిస్తున్నారనే దాని మీద కంపెనీ కొన్ని ఫీచర్లను విడుదల చేసింది. అవేంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

   

  కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  25MP Front-facing Camera

  ఈ ఫోన్ డిస్‌ప్లే ఐఫోన్ 10 తరహాలో ఉంటుంది. డిస్‌ప్లే పై భాగంలో నాచ్ ఏర్పాటు చేశారు. డిస్‌ప్లే ఎడ్జ్ టు ఎడ్జ్ తరహాలో ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అలాగే ఇందులో ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న పవర్‌ఫుల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారట. ఈ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. దీన్ని ఫేస్ అన్‌లాక్ చేసేందుకు కూడా ఉపయోగించుకోవచ్చని సమాచారం.

  Real-time HDR mode to tackle challenging light conditions

  ఒప్పోనుంచి త్వరలో రానున్న ఈ ఫోన్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.కాగా ఈ రకమైన టెక్నాలజీతో మార్కెట్లో దూసుకుపోతున్నది ఒప్పో మాత్రమే. అన్ని కంపెనీలకు సెల్ఫీ మార్కెట్లో గట్టి పోటీనిస్తూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు కంపెనీ రెడీ అయింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన OPPO F5, OPPO A83లు A.I Beauty Technologyతో సెల్ఫీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

  Improved AI Beauty 2.0 Mode

  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ, సెల్ఫీలకు బ్యూటీ మోడ్, రియల్ టైం హెచ్‌డీఆర్, ఏఆర్ స్టిక్కర్స్ తదితర ఫీచర్లు అందివ్వనున్నట్లు తెలిసింది. ఒప్పో ఎఫ్7 ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుంది. మీ స్కిన్ తోపాటు కళ్లు, వెంట్రుకలు మరింత అంతంగా కనిపించేలా చేస్తుంది. స్కిన్ టోన్, ఏజ్, జెండర్ ఫలితాల ఆధారంగా ఫొటోలను స్పష్టంగా తీస్తుంది. మీరున్నదానికంటే ఎక్కువ అందంగా ఫొటోలను తీసుకోవచ్చు. ఏఐ పవర్డ్ ఎడిటింగ్, ఫొటో ఆల్బమ్ అప్లికేషన్స్ ఫీచర్లు దీనికి అదనంగా ఉన్నాయి.

  AR (Augmented Reality) Stickers and Cover Shot Feature

  కవర్ షాట్, ఏఆర్(అనుబంధ వాస్తవికత) స్టిక్కర్స్ లతో యూజర్‌ని పర్సనల్ బ్యూటీ ఆర్టిస్టుగా తయారు చేస్తాయి. కవర్ షాట్ ఫీచర్ ద్వారా సెల్ఫీ కలర్‌ను కోరుకున్న విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంటే వేసుకున్న దుస్తులు, బ్యాక్ గ్రాండ్, ఇతరాలను మార్చుకునే వీలుంటుంది. అంతేగాక, ఏఆర్ స్టిక్కర్, స్నాప్ చాట్ ద్వారా ఆటలను కూడా ఆడుకోవచ్చు. సెల్ఫీలను తీసుకుని వాటిని అందమైన కుందేలు, నచ్చిన సినీ నటులుగా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.

  A.I. photo album management

  కొత్త ఎఫ్7 వర్షన్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో రూపొందించబడటం గమనార్హం. ఎఫ్7 అద్భుతమైన విధంగా 6.23 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ(1080x2280 పిక్సెల్స్) డిస్‌ప్లే, సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో. స్క్రీన్ పెద్దదిగా ఉండటం వల్ల గేమ్స్ ఆడుకోవడం కానీ, చదువుకోవడం గానీ సౌకర్యంగా ఉంటుంది. అంతేగాక, చేతులో ఇమిడే విధంగా ఉంది.

  Head turning design

  సోలార్ రెడ్, స్టార్రీ బ్లూ, మూన్ లైట్ సిల్వర్ రంగులలో ఎఫ్ 7 అందుబాటులోకి వస్తోంది. ఈ డిజైన్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్‌లో మరో సంచలనంగా మారే అవకాశం ఉంది. 128జీబీ ప్రత్యేక ఎడిషన్ కూడా ఈ ఒప్పో ఫోన్‌కు అదనపు ఆకర్షణ. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో కూడిన కొత్త ఒప్పో ఎఫ్ 7 పొందడానికి మార్చి 26 వరకు ఆగాల్సిందే. దీనికి సంబంధించిన ఇతర తాజా విషయాల కోసం ఎదురు చూడాల్సిందే.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  OPPO F7 will feature a smarter AI Selfie camera and a head turning design More news at Gibzot telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more