అతి పెద్ద డిస్‌ప్లే, ఎడ్జ్ టూ ఎడ్జ్ డిజైన్‌తో OPPO F7

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దిగ్గజ మొబైల్ కంపెనీలన్నీ అధునాతన ఫీచర్లతో సరికొత్తగా డివైస్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

|

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దిగ్గజ మొబైల్ కంపెనీలన్నీ అధునాతన ఫీచర్లతో సరికొత్తగా డివైస్ లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. స్క్రీన్ దగ్గర నుంచి మొదలు పెడితే ర్యామ్, కెమెరా, ఇతర హార్డ వేర్ అలాగే సాఫ్ట్ వేర్ లలో సరికొత్త మార్పులను తీసుకువచ్చి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటిదాకా స్మార్ట్‌ఫోన్లన్నీ 16:9 aspect ratio స్క్రీన్ తో దూసుకురాగా దాని స్థానాన్ని ఇప్పుడు 18:9 aspect ratio ఆక్రమించింది. మొబైల్ ఫోన్లలో మల్టీ వ్యూయింగ్ అనుభూతిని పొందాలంటే ఈ రేషియో ద్వారానే సాధ్యమని కంపెనీలు ఆ దిశగా తమ మొదడుకు పనిపెడుతున్నాయి. మరి బడ్జెట్ ధరలో ఇలాంటి ఫీచర్లను అందించే ఫోన్లు ఏమైనా ఉన్నాయా అని చాలామందికి సందేహం రావచ్చు. అలాంటి వారికోసం OPPO F7 బెస్ట్ ఆప్సన్ అని కంపెనీ చెబుతోంది.

19:9 Aspect ratio screen

19:9 Aspect ratio screen

మిడ్ రేంజ్ ధరలో ఒప్పో నుంచి 19:9 Aspect ratio screenతో దూసుకువస్తున్న ఫోన్ ఇదే. 6.2" Full HD+ display with a 2280 x 1080p resolutionతో యూజర్లు అదిరిపోయో డిస్ ప్లే వ్యూయింగ్ అనుభూతిని పొందుతారు. ఎక్కడా మీకు అంతరాయం లేకుంగా స్క్రీన్ లో మీరు చూడాలనుకున్న కంటెంట్ ఈ ఫీచర్ ద్వారా చూడవచ్చు.

Immersive Video playback and Gameplay

Immersive Video playback and Gameplay

కాగా ఈ రేంజ్ రేషియోలో 89.09 percent screen-to-body ratioతో మీరు వీడియో గేమ్స్ ఆస్వాదించవచ్చు. స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో ఈ ధరలో మరే ఇతర ఫోన్ ఇలాంటి ఫీచర్ ని ఆఫర్ చేయడం లేదు. ఫోన్ లుకింగ్ కూడా చాలా సన్నగా చేతిలో ఇమిడిపోయే విధంగా ఉండి మీరు మరింత ఆసక్తిగా గేమ్ ఆడేందుకు సహకరిస్తుంది.

A Design Marvel

A Design Marvel

బెజిల్ లెస్ డిస్ ప్లేతో ముందు భాగంలో మీకు పుల్ హెచ్ డి ప్లస్ డిస్ ప్లేపి అందించే విధంగా ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకొస్తోంది. కాగా 6.2 ఇంచ్ డిస్ ప్లే తో యూజర్లు సెల్పీ ఫోటోలను అలాగే వీడియోలనే చూస్తున్నప్పుడు డెస్క్ టాప్ లో చూస్తున్న అనుభూతి కలుగుతుందని కంపెనీ చెబుతోంది.

Smarter AI Selfie camera

Smarter AI Selfie camera

ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ సెల్ఫీ కెమెరా. 25 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సౌకర్యంతో ఈ ఫోన్ మార్కెట్లోకి వస్తోంది. సెల్ఫీ సెగ్మెంట్లో ఈ ఫోన్ ఓ సంచలనం అవుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. నాటరిక్ ఇమేజ్ సెన్సార్ కారణంగా ఫొటోలు ఎంతో స్పష్టంగా, వేగంగా తీసుకోవచ్చు. ఎఫ్7లో నెక్ట్స్ జనరేషన్ సెన్సార్-హెచ్‌డీఆర్, రంగులను స్పష్టంగా గుర్తించి స్పష్టంగా కనిపించేలా ఫొటోలు తీస్తుంది.

Profile picture ready even in extreme light condition

Profile picture ready even in extreme light condition

లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను ఇతర ఫోన్ కెమెరాల కంటే అద్భుతంగా తీయగలదు. ఒప్పో ఎఫ్7 ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుంది. మీ స్కిన్ తోపాటు కళ్లు, వెంట్రుకలు మరింత అంతంగా కనిపించేలా చేస్తుంది. స్కిన్ టోన్, ఏజ్, జెండర్ ఫలితాల ఆధారంగా ఫొటోలను స్పష్టంగా తీస్తుంది. మీరున్నదానికంటే ఎక్కువ అందంగా ఫొటోలను తీసుకోవచ్చు.ఏఐ పవర్డ్ ఎడిటింగ్, ఫొటో ఆల్బమ్ అప్లికేషన్స్ ఫీచర్లు దీనికి అదనంగా ఉన్నాయి. కవర్ షాట్, ఏఆర్(అనుబంధ వాస్తవికత) స్టిక్కర్స్ లతో యూజర్‌ని పర్సనల్ బ్యూటీ ఆర్టిస్టుగా తయారు చేస్తాయి.

Oppo A71 Unboxing

Oppo A71 Unboxing

సోలార్ రెడ్, స్టార్రీ బ్లూ, మూన్ లైట్ సిల్వర్ రంగులలో ఎఫ్ 7 అందుబాటులోకి వస్తోంది. ఈ డిజైన్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్‌లో మరో సంచలనంగా మారే అవకాశం ఉంది. 128జీబీ ప్రత్యేక ఎడిషన్ కూడా ఈ ఒప్పో ఫోన్‌కు అదనపు ఆకర్షణ. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో కూడిన కొత్త ఒప్పో ఎఫ్ 7 పొందడానికి మార్చి 26 వరకు ఆగాల్సిందే. దీనికి సంబంధించిన ఇతర తాజా విషయాల కోసం ఎదురు చూడాల్సిందే.

Best Mobiles in India

English summary
OPPO F7 will sport a 6.2-inch Full HD+ screen with a stunning edge-to-edge design more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X