హైలెట్ ఫీచర్లతో ఇండియాకి ఒప్పో ఎఫ్7, ధర రూ. 21,990, డేటా ఆఫర్లు ఇవే !

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియాలో ఈ ఏడాది తన తొలి స్మార్ట్‌ఫోన్ Oppo F7ని లాంచ్ చేసింది. ఎఫ్ సీరిస్ లో ఫర్ఫెక్ట్ సెల్పీ కెమెరాను ఇండియాలో లాంచ్ చేసింది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో ఇండియాలో ఈ ఏడాది తన తొలి స్మార్ట్‌ఫోన్ Oppo F7ని లాంచ్ చేసింది. ఎఫ్ సీరిస్ లో ఫర్ఫెక్ట్ సెల్పీ కెమెరాను ఇండియాలో లాంచ్ చేసింది. Oppo F1, F3, F5లు ఇప్పటికే ఇండియా మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో నాలుగో ఫోన్ గా Oppo F7 ఇండియా మార్కెట్లోకి దిగింది. సోలార్ రెడ్, స్టార్రీ బ్లూ, మూన్ లైట్ సిల్వర్ వేరియంట్లలో వచ్చిన ఈఫోన్ లో ప్రధాన ఆకర్షణ సెల్ఫీ నే. 25 ఎంపీ సెల్ఫీతో పాటు ఆర్టిఫీషియల్ టెక్నాలజీతో దూసుకువచ్చింది. లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను అద్భుతంగా తీయగల కెమెరా ఈ డివైఎస్‌ ప్రత్యేకతగా కంపెనీ చెప్పింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ బ్యూటికేషన్ ఏడు దశల్లో, రెండు స్కిన్ టోన్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు లాంచింగ్‌ సందర్భంగా కంపెనీ వెల్లడంచింది. 4/64 జీబీ వేరియంట్‌ ధర రూ. 21,990గా ఉండగా, 6/128 జీబీ వేరియంట్‌ రూ. 26,990గా ఉంది.

మీరు చేసే పనులన్నీ గూగుల్ పసిగడుతుందని తెలుసా, రక్షించుకోవడం ఎలా ?మీరు చేసే పనులన్నీ గూగుల్ పసిగడుతుందని తెలుసా, రక్షించుకోవడం ఎలా ?

 ఒప్పో ఎఫ్7 ఫీచర్లు

ఒప్పో ఎఫ్7 ఫీచర్లు

6.23 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

 భారీ డిస్‌ప్లే

భారీ డిస్‌ప్లే

6.23 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ X తరహాలో నాచ్‌ను అమర్చారు. ఇక ఫోన్ ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్‌లో మెమొరీ కార్డుతోపాటు రెండు సిమ్ కార్డుల కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా స్లాట్లు ఇచ్చారు. రెండు సిమ్ కార్డులు కూడా వీవోఎల్‌టీఈని సపోర్ట్ చేస్తాయి.

ఏప్రిల్ 9వ తేదీ నుంచి

ఏప్రిల్ 9వ తేదీ నుంచి

ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ మాత్రం ప్రత్యేకంగా ఒప్పో స్టోర్స్‌లోనే లభ్యం కానుంది. ఇక ఏప్రిల్ 2వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌తోపాటు దేశంలో ఉన్న 777 ఒప్పో స్టోర్స్‌లో 24 గంటల పాటు నిర్వహించనున్న ప్రత్యేక ఫ్లాష్ సేల్‌లో ఒప్పో ఎఫ్7ను విక్రయించనున్నారు.

 క్యాష్ బ్యాక్‌

క్యాష్ బ్యాక్‌

మొదటి 10వేల ఫోన్లను ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 5 శాతం క్యాష్ బ్యాక్‌ను అందివ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌పై జియో 12 నెలలకు గాను రూ.1200 క్యాష్‌బ్యాక్‌ను, 120 జీబీ అదనపు 4జీ మొబైల్ డేటాను అందివ్వనుంది. అలాగే ఏడాది కాలం పాటు వన్ టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్‌ను కూడా ఈ ఫోన్‌తోపాటు అందివ్వనున్నారు.

సెల్ఫీ ప్రియులకు

సెల్ఫీ ప్రియులకు

సెల్ఫీ ప్రియులకు ఇది అత్యుత్తమ బ్యూటిఫికేషన్ ఎడిట్స్ ని అందించేలా ఒప్పో ఎఫ్7 ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుందని తెలిపింది. స్కిన్‌తోపాటు కళ్లు, వెంట్రుకలను సైతం మరింత అంతంగా కనిపించేలా చేస్తుందట. అంతేకాదు ఈస్మార్ట్‌ఫోన్‌ జెండర్‌ను కూడా గుర్తిస్తుందట. అలాగే సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో వచ్చింది.

Best Mobiles in India

English summary
Oppo F7 With 25-Megapixel Front Camera, Bezel-Less Display Launched in India: Price, Specifications More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X