దేశీయ మార్కెట్లో విడుదులైన ఒప్పో ఎఫ్9 ప్రొ 128 జీబీ వేరియెంట్

చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో రెండు నెలల క్రితం ఒప్పో ఎఫ్9 ప్రొ స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.

|

చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో రెండు నెలల క్రితం ఒప్పో ఎఫ్9 ప్రొ స్మార్ట్ ఫోన్ ను ఇండియా మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫోన్ యొక్క 128 జీబీ వేరియెంట్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది.రూ.25,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌ను అమెజాన్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

 

ఆపిల్ నుంచి 5జీ ఫోన్ వస్తోంది, ఎప్పుడో తెలుసా?ఆపిల్ నుంచి 5జీ ఫోన్ వస్తోంది, ఎప్పుడో తెలుసా?

ఒప్పో ఎఫ్9 ప్రొ ఫీచర్లు...

ఒప్పో ఎఫ్9 ప్రొ ఫీచర్లు...

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, వీవోవోసీ ఫ్లాస్ చార్జ్.

గేమింగ్ ప్రియులకు మంచి అనుభూతి....

గేమింగ్ ప్రియులకు మంచి అనుభూతి....

నేటి తరం స్మార్ట్ ఫోన్లు గేమింగ్ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న తరుణంలో కంపెనీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధను పెట్టింది. ఫోన్ డిజైనింగ్ లా భారీ మార్పులను చేసింది. ముందుభాగంలో వాటర్ డ్రాప్స్ పడుతున్నట్లుగా కనిపించేలా ఫోన్ స్క్రీన్ ని డిజైన్ చేశారు. బాడీ స్క్రీన్ రేషియో 90.8%గా ఉంది. దీని ద్వారా గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతి కలగనుంది.

VOOC Flash Charge అనే సరికొత్త టెక్నాలజీ.....
 

VOOC Flash Charge అనే సరికొత్త టెక్నాలజీ.....

ఈ ఫోన్ కి కొత్తగా VOOC Flash Charge టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ సాధారణ ఛార్జింగ్ కన్నా అయిదు రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుంది. సాధారన ఛార్జ్ లకు 5V/1A charging technology ఉంటే దీనికి మాత్రం 5V/4A chargingని పొందుపరిచారు. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే దాదాపు 2 గంటల వరకు మీరు మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.

కలర్స్...

కలర్స్...

ఈ రోజుల్లో ఫోన్ అభిమానులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే వాటికోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కలర్, షైనింగ్ విభాగాల్లో మంచి ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ OPPO F9 Proని సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువస్తోంది. Cyan, Red, Purple, ఇతర రంగుల్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ ని తీసుకొస్తోంది.షైనింగ్ విషయంలో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా మెరుగులు దిద్దారు. రప్ అండ్ టప్ గా వాడినప్పటికీ ఈ ఫోన్ రంగులో ఎటువంటి డ్యామేజీ కనిపించదు.

Best Mobiles in India

English summary
Oppo F9 Pro 128GB storage variant launched in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X