Home
Mobile

రూ. 23,990లో బడ్జెట్‌లో పర్‌ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్ :Oppo F9 Pro రివ్యూ

గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.అవి కమ్యూనికేషన్స్ కోసమే కాకుండా అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా మినీ కంప్యూటర్ లా ఉండే వాటిని అందరూ ఎక్కువగా ఇష్టపడుత

By Anil

గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.అవి కమ్యూనికేషన్స్ కోసమే కాకుండా అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా మినీ కంప్యూటర్ లా ఉండే వాటిని అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే టాప్ కంపెనీలు కూడా వినియోగదారుల కనుగుణంగానే ఫీచర్లను అందిస్తూ సరికొత్తగా మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఒప్పో కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మార్కెట్లోకి Oppo F9 pro పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.VOOC Flash Charge అనే సరికొత్త టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టింది ఒప్పో కంపెనీ. ఈ ఫోన్ ధర రూ. 23,990 గా కంపెనీ నిర్ణయించింది. త్వరలో ఈ Oppo F9 pro ను ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయొచ్చు.

Oppo F9 pro ఫీచర్స్.....

Oppo F9 pro ఫీచర్స్.....

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

డిస్‌ప్లే.....

డిస్‌ప్లే.....

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5 డి కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. దీంతో పాటు 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, Mali-G72 MP3 గ్రాఫిక్స్ మీద ఫోన్ రన్ అవుతుంది.

స్టోరేజ్....

స్టోరేజ్....

ఇక స్టోరేజ్ విషయానికొస్తే 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

కెమెరా.....

కెమెరా.....

కెమెరా విషయానికొస్తే 16,2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు. 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

గేమింగ్ ప్రియులకు మంచి అనుభూతి....

గేమింగ్ ప్రియులకు మంచి అనుభూతి....

నేటి తరం స్మార్ట్ ఫోన్లు గేమింగ్ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న తరుణంలో కంపెనీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధను పెట్టింది. ఫోన్ డిజైనింగ్ లా భారీ మార్పులను చేసింది. ముందుభాగంలో వాటర్ డ్రాప్స్ పడుతున్నట్లుగా కనిపించేలా ఫోన్ స్క్రీన్ ని డిజైన్ చేశారు. బాడీ స్క్రీన్ రేషియో 90.8%గా ఉంది. దీని ద్వారా గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతి కలగనుంది.

VOOC Flash Charge అనే సరికొత్త టెక్నాలజీ.....

VOOC Flash Charge అనే సరికొత్త టెక్నాలజీ.....

ఈ ఫోన్ కి కొత్తగా VOOC Flash Charge టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ సాధారణ ఛార్జింగ్ కన్నా అయిదు రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుంది. సాధారన ఛార్జ్ లకు 5V/1A charging technology ఉంటే దీనికి మాత్రం 5V/4A chargingని పొందుపరిచారు. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే దాదాపు 2 గంటల వరకు మాట్లాడుకోవచ్చు.

మూడు రంగుల్లో....

మూడు రంగుల్లో....

ఈ రోజుల్లో ఫోన్ అభిమానులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే వాటికోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కలర్, షైనింగ్ విభాగాల్లో మంచి ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ OPPO F9 Proని సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువస్తోంది. Cyan, Red, Purple, ఇతర రంగుల్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ ని తీసుకొస్తోంది.షైనింగ్ విషయంలో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా మెరుగులు దిద్దారు. రప్ అండ్ టప్ గా వాడినప్పటికీ ఈ ఫోన్ రంగులో ఎటువంటి డ్యామేజీ కనిపించదు.

బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్...

బ్యాటరీ ఇంకా సాఫ్ట్‌వేర్...

Oppo F9 pro హ్యాండ్‌సెట్‌కు 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది.

 

 

 

 

 

 

Best Mobiles in India

English summary
OPPO F9 Pro: Engineered for today's tech savvy content creators.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X