కొత్త టెక్నాలజీతో దూసుకొస్తున్న OPPO F9 Pro
గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.
గత కొద్ది సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్ల యుగం విపరీతంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.అవి కమ్యూనికేషన్స్ కోసమే కాకుండా అన్ని అవసరాలకు ఉపయోగపడే విధంగా మినీ కంప్యూటర్ లా ఉండే వాటిని అందరూ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే టాప్ కంపెనీలు కూడా వినియోగదారుల కనుగుణంగానే ఫీచర్లను అందిస్తూ సరికొత్తగా మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్లను తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా ఒప్పో కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మార్కెట్లోకి ఒప్పో ఎఫ్9 ప్రో పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయబోతోంది. లీకయిన ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

VOOC Flash Charge
ఈ ఫోన్ కి కొత్తగా VOOC Flash Charge టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ సాధారణ ఛార్జింగ్ కన్నా అయిదు రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుంది. సాధారన ఛార్జ్ లకు 5V/1A charging technology ఉంటే దీనికి మాత్రం 5V/4A chargingని పొందుపరిచారు. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే దాదాపు 2 గంటల వరకు మీరు మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.

గేమింగ్ అనుభూతి
నేటి తరం స్మార్ట్ ఫోన్లు గేమింగ్ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న తరుణంలో కంపెనీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధను పెట్టింది. ఫోన్ డిజైనింగ్ లా భారీ మార్పులను చేసింది. ముందుభాగంలో వాటర్ డ్రాప్స్ పడుతున్నట్లుగా కనిపించేలా ఫోన్ స్క్రీన్ ని డిజైన్ చేశారు. బాడీ స్క్రీన్ రేషియో 90.8%గా ఉంది. దీని ద్వారా గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతి కలగనుంది.

కలర్స్
ఈ రోజుల్లో ఫోన్ అభిమానులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే వాటికోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కలర్, షైనింగ్ విభాగాల్లో మంచి ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ OPPO F9 Proని సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువస్తోంది. Cyan, Red, Purple, ఇతర రంగుల్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ ని తీసుకొస్తోంది.షైనింగ్ విషయంలో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా మెరుగులు దిద్దారు. రప్ అండ్ టప్ గా వాడినప్పటికీ ఈ ఫోన్ రంగులో ఎటువంటి డ్యామేజీ కనిపించదు.

ఒప్పో ఎఫ్9
కాగా ఒప్పో ఎఫ్9 వియత్నాం, ఫిలిప్పీన్స్ మార్కెట్‌లలో తాజాగా విడుదల అయింది. ఈ నెల 21వ తేదీన భారత్‌లో ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.23,290 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఒప్పో ఎఫ్9 స్మార్ట్‌ఫోన్‌లో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లే, 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను అమర్చారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలను, ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు.
ఒప్పో ఎఫ్9 ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








