సరికొత్త టెక్నాలజీతో ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతున్న Oppo F9 pro
చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతుంది. Oppo F9 pro పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుంది.
చైనా మొబైల్ తయారీ దిగ్గజం ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ చేయబోతుంది. Oppo F9 pro పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుంది.సరికొత్త ఫీచర్స్ తో అధునాతనమైన టెక్నాలజీ తో యూజర్లను మురిపించబోతుంది. ముక్యంగా గేమింగ్ లవర్స్ ను దృషిటిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ ను తయారు చేసారు అని కంపెనీ తెలిపింది. VOOC Flash Charge అనే సరికొత్త టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టినట్టు సమాచారం.ఈ నేపథ్యం లో ఈ రోజు ఇండియా లో Oppo F9 pro లాంచ్ జరగనుంది. ఒప్పో అధికారిక వెబ్ సైట్ లో లైవ్ ఈవెంట్ ను వీక్షించవచ్చు.

Oppo F9 pro ఫీచర్స్.....
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

గేమింగ్ ప్రియులకు మంచి అనుభూతి....
నేటి తరం స్మార్ట్ ఫోన్లు గేమింగ్ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న తరుణంలో కంపెనీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధను పెట్టింది. ఫోన్ డిజైనింగ్ లా భారీ మార్పులను చేసింది. ముందుభాగంలో వాటర్ డ్రాప్స్ పడుతున్నట్లుగా కనిపించేలా ఫోన్ స్క్రీన్ ని డిజైన్ చేశారు. బాడీ స్క్రీన్ రేషియో 90.8%గా ఉంది. దీని ద్వారా గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతి కలగనుంది.

VOOC Flash Charge అనే సరికొత్త టెక్నాలజీ.....
ఈ ఫోన్ కి కొత్తగా VOOC Flash Charge టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ సాధారణ ఛార్జింగ్ కన్నా అయిదు రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుంది. సాధారన ఛార్జ్ లకు 5V/1A charging technology ఉంటే దీనికి మాత్రం 5V/4A chargingని పొందుపరిచారు. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే దాదాపు 2 గంటల వరకు మీరు మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.

మూడు రంగుల్లో....
ఈ రోజుల్లో ఫోన్ అభిమానులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే వాటికోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కలర్, షైనింగ్ విభాగాల్లో మంచి ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ OPPO F9 Proని సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువస్తోంది. Cyan, Red, Purple, ఇతర రంగుల్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ ని తీసుకొస్తోంది.షైనింగ్ విషయంలో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా మెరుగులు దిద్దారు. రప్ అండ్ టప్ గా వాడినప్పటికీ ఈ ఫోన్ రంగులో ఎటువంటి డ్యామేజీ కనిపించదు.


Click it and Unblock the Notifications








