Home
Mobile

మునుపెన్నడు రాని సరికొత్త ఫీచర్లతో OPPO F9 Pro

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది.ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండి తీరుతుంది.

By Anil

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది.ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండి తీరుతుంది.ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా వినియోగదారుల్ని ఆకర్షించే విధంగా సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లో తమ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఒప్పో కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లోకి Oppo F9 Pro పేరుతో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.ఈ స్మార్ట్ ఫోన్ లో VOOC Flash Charge అనే సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఒప్పో కంపెనీ. ఈ టెక్నాలజీ ద్వారా ఫోన్ సాధారణ ఛార్జింగ్ కన్నా అయిదు రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుంది. సాధారన ఛార్జ్ లకు 5V/1A ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటే దీనికి మాత్రం 5V/4A ఛార్జింగ్ ని పొందుపరిచారు. 5 నిమిషాలు ఛార్జింగ్ పెడితే దాదాపు 2 గంటల వరకు మాట్లాడుకోవచ్చు.

క్లాసీ వాటర్ డ్రాప్ స్క్రీన్.....

క్లాసీ వాటర్ డ్రాప్ స్క్రీన్.....

మొబైల్ వినియోగంలో భారతీయుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు అనుగుణంగా డిజైన్ రూపొందించారు.6.3 అంగుళాలు కలిగిన స్క్రీన్ 2340*1080 పిక్సెల్‌తో హెచ్‌డీ వ్యూ ఇస్తుంది. క్లాసీ వాటర్ డ్రాప్ స్క్రీన్ Oppo F9 pro హైలైట్‌గా నిలిచింది.

కెమెరా క్వాలిటీ.....

కెమెరా క్వాలిటీ.....

ఒప్పో అంటేనే కెమెరా క్వాలిటీకి పేరుగాంచింది. 16,2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో అదిరిపోయే ఫోటోలు తీసుకోవచ్చు.అదే విధంగా 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.దీని ద్వారా క్వాలిటీ గల సెల్ఫీ ఫోటోలను తీసుకోవచ్చు

 vooc ఫ్లాష్ టెక్నాలజీ....

vooc ఫ్లాష్ టెక్నాలజీ....

స్వదేశీ పరిజ్ఞానంతో vooc ఫ్లాష్ టెక్నాలజీని రూపొందించారు. కేవలం బ్యాటరీ ఛార్జింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఫ్లాష్ టెక్నాలజీ ఐదు లేయర్ల రక్షణ కవచం ఉండటంతో 3500mah సామర్థ్యం ఉన్న బ్యాటరీ వేడెక్కకుండా భద్రపరుస్తుంది. అంతేకాదు ఛార్జింగ్ చేస్తున్న సమయంలో కూడా ఫోన్ వినియోగించొచ్చు. సాధారణ మొబైళ్లతో ఇది సాధ్యపడదు. ఫ్లాష్ టెక్నాలజీతో పాటు మొబైల్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరూ తయారు చేయని డిజైన్ స్పెసిఫికేషన్స్‌తో Oppo F9 pro వస్తోంది.

సరికొత్త సాఫ్ట్ వేర్ ,snappy హార్డ్ వేర్

సరికొత్త సాఫ్ట్ వేర్ ,snappy హార్డ్ వేర్

సరికొత్త సాఫ్ట్ వేర్ మరియు snappy హార్డ్వేర్ OPPO F9 Pro ఒక సంక్లిష్టమైన చిప్ సెట్ మద్దతును ఇస్తుంది. అదే విధంగా మృదువైన ప్రాసెసింగ్ మరియు మల్టీ టాస్కింగ్ కోసం 6GB ర్యామ్ ను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది.

 

 

అదిరిపోయే  రంగుల్లో....

అదిరిపోయే రంగుల్లో....

ఈ రోజుల్లో ఫోన్ అభిమానులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే వాటికోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కలర్, షైనింగ్ విభాగాల్లో మంచి ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారి అభిరుచిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ OPPO F9 Proని సరికొత్తగా మార్కెట్లోకి తీసుకువస్తోంది.సన్‌రైజ్ రెడ్, ట్విలైట్ బ్లూ, స్టారీ పర్పల్ , ఇతర రంగుల్లో అత్యంత ఆకర్షణీయమైన బ్రైట్ నెస్ తో ఈ ఫోన్ ని తీసుకొస్తోంది.షైనింగ్ విషయంలో ఎటువంటి సమస్యలకు తావివ్వకుండా మెరుగులు దిద్దారు. రప్ అండ్ టప్ గా వాడినప్పటికీ ఈ ఫోన్ రంగులో ఎటువంటి డ్యామేజీ కనిపించదు.

గేమింగ్ ప్రియులను ఎక్కువ ఆకట్టుకునే విధంగా....

గేమింగ్ ప్రియులను ఎక్కువ ఆకట్టుకునే విధంగా....

నేటి తరం స్మార్ట్ ఫోన్లు గేమింగ్ ప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న తరుణంలో కంపెనీ కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధను పెట్టింది. ఫోన్ డిజైనింగ్ లా భారీ మార్పులను చేసింది. ముందుభాగంలో వాటర్ డ్రాప్స్ పడుతున్నట్లుగా కనిపించేలా ఫోన్ స్క్రీన్ ని డిజైన్ చేశారు. బాడీ స్క్రీన్ రేషియో 90.8%గా ఉంది. దీని ద్వారా గేమింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతి కలగనుంది.

బ్యాటరీ....

బ్యాటరీ....

ఈ Oppo F9 pro హ్యాండ్‌సెట్‌కు 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.

Oppo F9 Pro ఫీచర్స్.....

Oppo F9 Pro ఫీచర్స్.....

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫ్లాష్ చార్జింగ్.

చివరి మాటలు....

చివరి మాటలు....

Oppo F9 Pro స్మార్ట్ ఫోన్ కేవలం ఒప్పో బ్రాండ్‌లోనే కాదు స్మార్ట్ ఫోన్ రంగంలోనే కొత్త ఒరవడి సృష్టించింది. తొలిసారిగా vooc ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో రావడం Oppo F9 Pro మొబైల్ ఇండస్ట్రీలోనే రికార్డు క్రియేట్ చేసింది. ఆగష్టు 21న ఈ Oppo F9 Pro ఫోను కంపెనీ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధరను రూ. 23,990 గా కంపెనీ నిర్ణయించింది.మరికొద్ది రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా ఆఫ్‌లైన్ ద్వారా ఈ Oppo F9 Pro మార్కెట్లలో లభ్యమవుతుంది.

Best Mobiles in India

English summary
OPPO F9 Pro: Next gen. technology features without compromising on basics.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X