OPPO Find N5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఈ ఫోన్ ప్రత్యేకత తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు..!
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ క్రమంగా విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగా ఫోన్‌ల తయారీ సంస్థలు వివిధ మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఒప్పో తాజాగా టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది. అత్యంత సన్నని డిజైన్‌తో విడుదల చేసింది. ఒప్పో ఫైండ్ N5 (OPPO Find N5 Foldable Smartphone Launched) ఫోన్ ఫోల్డింగ్ సమయంలో థిక్‌నెస్ 8.93 mm గా ఉంటుంది. అదే అన్‌ఫోల్డ్ చేసినప్పుడు కేవలం 4.21mm థిక్‌నెస్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.
ఒప్పో ఫైండ్ N5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 7000 సిరీస్ అల్యామినియం ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఫలితంగా ఈ ఫోన్ బరువు కేవలం 229 గ్రాములుగా మాత్రమే ఉంటుంది. 3D ప్రింటెడ్ టైటానియం వింగ్ ప్యానల్ మరియు కార్బన్ ఫైబర్ మెటీరియల్స్ కారణంగా తక్కువ బరువును కలిగి ఉంది.

ఒప్పో ఫైండ్ N5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ 8.12 అంగుళాల (2480*2248 పిక్సల్స్) FHD+ LTPO OLED ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1 నుంచి 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160 PWM డిమ్మింగ్ ను కలిగి ఉంది. అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.
అదే విధంగా 6.62 అంగుళాల (2480*2248 పిక్సల్స్) FHD+ LTPO OLED ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1 నుంచి 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 2450 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160 PWM డిమ్మింగ్ ను కలిగి ఉంది. అల్ట్రా థిన్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ Adreno 830 GPU, 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 తో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుంది.
గ్లోబల్ మార్కెట్‌లో ఈ ఫోన్ ఒకే స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంటుంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ లోనే లభిస్తుంది. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 80W SUPERVOOC ఛార్జింగ్, 50W AirVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా Hasselblad ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో 50MP సోనీ LYT-700 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 3X ఆప్టికల్ జూమ్‌తో 50MP శాంసంగ్ JN5 పెరిస్కోప్ లెన్స్, ఆటోఫోకస్ సపోర్టుతో 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.3, వైఫై 802.11, NFC, GPS, QZSS, USB-C, Beidou, Glonass, Galileo వంటి ఫీచర్‌లున్నాయి. స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ IPX6, IPX8, IPX9 రేటింగ్‌తో మెరుగైన వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్, మిస్టీ వైట్ రంగుల్లో లభించనుంది.
ఒప్పో ఫైండ్ N5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు : ఈ ఒప్పో ఫోల్డబుల్ ఫోన్ ధర సింగపూర్‌లో 2499 SGD భారత్ కరెన్సీలో సుమారుగా రూ.1,61,779) గా ఉంది. అయితే భారత్ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర, సేల్ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








