Home
Mobile

OPPO Find N5 గ్రాండ్ లాంచ్.. మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా చరిత్ర క్రియేట్!

OPPO Find N5: ఒప్పో ఫైండ్ N5 ఈ రోజు ప్రపంచ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. 2025లో విడుదలైన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్‌గా ఇది సరికొత్త రికార్డులు సృష్టించబోతోంది. చూడటానికి చాలా సన్నగా, స్టైలిష్‌గా ఉంటూనే, ఫీచర్ల విషయంలో మాత్రం టాప్ గేర్‌లో దూసుకుపోతుంది ఈ ఫోన్. ఫోల్డబుల్ ఫోన్ సెగ్మెంట్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి OPPO రెడీ అయిపోయింది. అంతేకాదు,

ఈ లాంచ్ ఈవెంట్‌లో ఫైండ్ N5తో పాటు ఒప్పో వాచ్ X2ను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సింగపూర్‌లో సాయంత్రం 7:00 గంటలకు, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ లవర్స్ ఈ అన్‌వీలింగ్ ఈవెంట్‌ను లైవ్‌లో చూసేందుకు OPPO అదిరిపోయే ఏర్పాట్లు చేసింది.

OPPO Find N5 Unveiled  Worlds First Snapdragon 8 Elite Foldable Smartphone

OPPO అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, యూట్యూబ్ ఛానెల్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఒప్పో ఫైండ్ N5 ఇండియాలో వన్‌ప్లస్ ఓపెన్ 2 పేరుతో రిలీజ్ చేస్తుందని అన్నారు కానీ, వన్‌ప్లస్ మాత్రం ఈ సంవత్సరం ఎలాంటి ఫోల్డబుల్ ఫోన్‌ను రిలీజ్ చేయడం లేదని తేల్చి చెప్పేసింది. దీంతో, ఫైండ్ N5 ఇండియాలో విడుదలవ్వదు.

* ఫైండ్ N5 ధర ఎంత ఉండొచ్చు

ధర విషయానికొస్తే, ఒప్పో ఫైండ్ N5 ధర సుమారు SGD 2,599 (దాదాపు రూ.1,68,200) ఉంటుందని అంచనా. పోల్చి చూస్తే, దీని ముందు మోడల్ అయిన ఒప్పో ఫైండ్ N3 ధర SGD 2,399 (సుమారు రూ.1,45,000)గా ఉంది. ఈ ప్రైస్‌ చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. ఈ మొబైల్స్ టాప్-ఎండ్ శామ్‌సంగ్, యాపిల్ ఫోన్స్ తో తలపడతాయి.

* కీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఒప్పో ఫైండ్ N5లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను వాడారు. ఇందులో పెద్ద 5,600mAh బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఒప్పో ColorOS 15 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో డ్యూయల్ 120Hz LTPO OLED డిస్‌ప్లేలు ఉన్నాయి. లోపల ఒకటి, బయట ఒకటి.

* కెమెరాలు

ఒప్పో ఈసారి హాసెల్‌బ్లాడ్ (Hasselblad)తో చేతులు కలిపింది. ఫైండ్ N5 కెమెరాలకు అప్‌గ్రేడ్ ఇచ్చారు. వెనుకవైపు 50MP సోనీ మెయిన్ సెన్సార్ (OIS తో), 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు రెండు 32MP కెమెరాలు ఇచ్చారు. మెయిన్ స్క్రీన్‌పై ఒకటి, కవర్ డిస్‌ప్లేపై మరొకటి.

* అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు

ఒప్పో ఫైండ్ N5లో యూజర్ల కోసం చాలా AI ఫీచర్లను తీసుకొచ్చారు. మీ పనులు ఈజీగా చేసుకోవడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ ఫోన్ యాపిల్ మ్యాక్ స్క్రీన్ మిర్రింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే, మీ మ్యాక్ ని Find N5 నుంచే కంట్రోల్ చేయొచ్చు. ఫోన్‌ను 90 డిగ్రీల యాంగిల్‌లో ఫోల్డ్ చేస్తే, కింది సగం స్క్రీన్ కీబోర్డ్‌లా పనిచేస్తుంది.

O+ కనెక్ట్ యాప్ ద్వారా Find N5, Mac, ఐఫోన్స్ మధ్య ఫైల్స్‌ను ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ చేసేవాళ్లకి, మల్టీ టాస్కింగ్ చేసేవాళ్లకి ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒప్పో Find N5 మూడు కలర్స్‌ =జేడ్ వైట్, సాటిన్ బ్లాక్, ట్విలైట్ పర్పుల్)లో అందుబాటులో ఉంటుంది.

అన్నీ కూడా చూడటానికి చాలా ప్రీమియంగా, స్టైలిష్‌గా ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్, పవర్ఫుల్ ఫీచర్లతో OPPO Find N5 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి రెడీగా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OPPO Find N5, the first Snapdragon 8 Elite foldable, debuts with 120Hz OLED screens, Hasselblad cameras, and AI features. Launched in Singapore, livestream available. India release unlikely, priced around SGD 2,599.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X